Divorce Party : భర్తతో విడాకులు తీసుకొని.. డైవర్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న మహిళ
డైవర్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న మహిళ | మ్యారేజ్ పార్టీ, బర్త్‌డే పార్టీ, సంగీత్, ఎంగేజ్మెంట్ లాంటివి చూశాం కానీ.. ఈ డైవర్స్ పార్టీ ఏంటి.. కొత్తగా ఉంది
మ్యారేజ్ పార్టీ, బర్త్‌డే పార్టీ, సంగీత్, ఎంగేజ్మెంట్ లాంటివి చూశాం కానీ.. ఈ డైవర్స్ పార్టీ ఏంటి.. కొత్తగా ఉంది. దీన్ని ఎప్పుడూ చూడలేదు అంటారా.. అయితే మనం సోనియా గుప్తా అనే మహిళ గురించి తెలుసుకోవాల్సిందే.

45 ఏళ్ల వయసు ఉన్న సోనియా గుప్తాకు 2003లో ఇండియాలో పెళ్లి అయింది. పెళ్లి తర్వాత తన భర్తతో పాటు యూకేకు షిఫ్ట్ అయింది సోనియా. అప్పుడే తనకు కష్టాలు మొదలయ్యాయి.
“నాకు పెళ్లి అయ్యాక కొన్ని సంవత్సరాలకే నా ముఖంలో సంతోషం మాయం అయింది. నా జీవితం కేవలం ఇంటికే పరిమితం అయింది. నా లైఫ్ ఇంతేనా. ఇందుకోసమేనా.. నేను ఎన్నో కలలు కన్నది.. అని నాలో నేను ఎంతో బాధపడ్డాను. కానీ.. నేను బతికింది.. బతుకుతున్నది కేవలం నా కొడుకులు మైఖల్, షాయ్ కోసమే. వాళ్లే నాకు నా కష్టకాలంలో తోడుగా ఉన్నారు. నాకు ఆసరాగా నిలిచారు. నాకు పెళ్లి కాకముందు నేను చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. బయటికెళ్తూ సరదాగా ఫ్రెండ్స్‌తో గడిపేదాన్ని. కానీ.. ఇప్పుడు అవేమీ లేవు. అసలు.. బయటికి వెళ్లడమే లేదు.. అందుకే నాకు ఫ్రీడమ్ కావాలనుకున్నాను. విడాకులకు దరఖాస్తు పెట్టుకున్నాను. పెళ్లయిన 17 ఏళ్ల తర్వాత నాకు విముక్తి కలిగింది. విడాకులు మంజూరు అయ్యాయి. ఇప్పుడు నేను ఫ్రీబర్డ్. నేను అనుకున్నది చేసేంత సమయం ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాను..” అంటూ సోనియా చెప్పుకొచ్చింది.
తనకు విడాకులు రావడంతో సంతోషంతో తన ఫ్రెండ్స్, బంధువులను పిలిచి.. డైవర్స్ పార్టీ ఇచ్చింది సోనియా. రంగురంగుల డ్రెస్ వేసుకొని.. ఫైనల్నీ డైవర్స్‌డ్ అని టాగ్ తగిలించుకొని ఎంజాయ్ చేసింది సోనియా.
“విడాకుల తర్వాత ఇక జీవితమే ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. విడాకుల తర్వాతే నా జీవితం ఇప్పుడు మొదలైంది. ఇప్పుడే నేను ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నాను. జైలు జీవితం నుంచి బయటపడ్డాను. ప్రపంచాన్నే జయించినట్టుగా ఉంది. ఇప్పుడు నేను నాకు నచ్చినట్టుగా బతుకుతాను..” అని సోనియా మరోసారి స్పష్టం చేసింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
Pet Dog : పెంపుడు కుక్క విమాన ప్రయాణం కోసం.. బిజినెస్ క్లాస్ టికెట్లు అన్నీ కొనేసింది
Blue Flag : కోవలం, ఈడెన్ బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్.. ఎందుకో తెలుసా?
Vaccine Promotion : వ్యాక్సిన్లపై యువకుడి వినూత్న ప్రమోషన్.. ఎక్కడంటే?
బాయ్‌ఫ్రెండ్ కోసం షాపింగ్ మాల్లో ముగ్గురు యువతుల సిగపట్లు!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

