బాయ్‌ఫ్రెండ్ కోసం షాపింగ్ మాల్లో ముగ్గురు యువతుల సిగపట్లు!

పట్నా : ఓ బాయ్‌ఫ్రెండ్ కోసం ముగ్గురు అమ్మాయిలు కొట్టుకున్న ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో వెలుగుచూసింది. మోతిజీల్ ప్రాంతంలోని మాల్లో చిత్రీకరించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అబ్బాయి కోసం ముగ్గురు అమ్మాయిలు ఘర్షణ పడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. ఇద్దరు యువతులు ఒకరిపై ఒకరు కలబడగా, మరో యువతి అక్కడికి చేరుకుని ఆపై ఆమె కూడా దెబ్బలాటకు దిగింది. వీడియోలో ఓ యువకుడు అక్కడ కనిపించాడు.
ఇక అమ్మాయిలు ఒకరినొకరు కొట్టడం, జుట్టు పట్టుకుని లాగడం వంటివి కనిపించాయి. గొడవ పెద్దది కావడంతో ఓ వ్యక్తి జోక్యం చేసుకుని వారిని వారించడంతో వ్యవహారం సద్దుమణిగింది. మాల్లో అమ్మాయిలు బాహాబాహీకి దిగడంతో ప్రజలు గుమికూడి ఫోటోలు, వీడియోలు తీయడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా వేదికలపై చక్కర్లు కొట్టిన ఈ వీడియో ఇప్పటివరకూ 5,000కుపైగా వ్యూస్ రాబట్టింది. అమ్మాయిల సిగపట్లను సింగిల్స్ ఎంజాయ్ చేస్తున్నారని ఓ నెటిజన్ ఈ వీడియోకు కామెంట్ చేయగా, వీరికి చేసేందుకు పనేం లేదా అని మరో యూజర్ మండిపడ్డాడు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

