Fastest man on two hands : రెండు చేతులతో అత్యంత వేగంగా పరిగెత్తి గిన్నిస్ రికార్డ్.. వీడియో
రెండు చేతులతో అత్యంత వేగంగా పరిగెత్తి గిన్నిస్ రికార్డ్ | కాళ్లతో పరిగెత్తడం ఓకే కానీ.. చేతులతో పరిగెత్తడం ఏంటి.. అని అనుకుంటున్నారా.. అయితే మీరు

కాళ్లతో పరిగెత్తడం ఓకే కానీ.. చేతులతో పరిగెత్తడం ఏంటి.. అని అనుకుంటున్నారా.. అయితే మీరు జియోన్ క్లార్క్ గురించి తెలుసుకోవాల్సిందే. అతడిది యూఎస్. రెజ్లర్, అథ్లెట్. కానీ.. ఒలింపిక్స్లో మెడల్ కొట్టడమే ఆయన లక్ష్యం. కానీ.. అందరిలా సాధారణ వ్యక్తి కాదు అతడు. అతడికి రెండు కాళ్లు లేవు. కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్ అనే చాలా అరుదైన జెనెటిక్ డిజార్డర్ వల్ల రెండు కాళ్లు లేకుండానే పుట్టాడు జియోన్.

రెండు కాళ్లు లేకున్నప్పటికీ.. తను తోటి మనుషులకు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాడు. రెండు కాళ్లు లేకున్నా అథ్లెట్ అయ్యాడు. రెజ్లర్ అయ్యాడు. ఇప్పుడు ప్రపంచంలోనే రెండు చేతులతో అత్యంత వేగంగా పరిగెత్తే వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించాడు.

గిన్నిస్ రికార్డులో తన పేరు ఎక్కడం, గిన్నిస్ ప్రతినిధులు తనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ను కూడా అందించడంతో.. తెగ ఆనందపడిపోయాడు జియోన్. అన్నీ సక్రమంగా ఉండి కూడా ఏం చేయలేక.. సోమరిపోతుల్లా తిరుగుతున్న ఎందరో యువకులకు జియోన్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. హ్యేట్సాఫ్ జియోన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Divorce Party : భర్తతో విడాకులు తీసుకొని.. డైవర్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న మహిళ
Viral Video : కొడుకు పుట్టిన ఆనందంలో తొలిసారి బాబును ఎత్తుకొని ఈ తండ్రి ఏం చేశాడో చూడండి
Pet Dog : పెంపుడు కుక్క విమాన ప్రయాణం కోసం.. బిజినెస్ క్లాస్ టికెట్లు అన్నీ కొనేసింది
Mimicry Bird : పసిపాపలా ఏడుస్తూ మిమిక్రీ చేస్తున్న పక్షి.. అవాక్కవుతున్న నెటిజన్లు
Viral Video : ఈ వీడియో చూసి మీరు నవ్వకుండా ఉంటే గ్రేట్..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

