Viral Video : నా లవర్ సినిమాకు రమ్మంటే వస్తలేదు అన్న.. అంటూ ఫోన్ను ఏం చేశాడో చూడండి
నా లవర్ సినిమాకు రమ్మంటే వస్తలేదు అన్న | సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇటీవలే అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ వీడియో
సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇటీవలే అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. ఆ వీడియోపై మీమ్స్, ట్రోల్స్.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే చర్చ. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది.

ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఓ యువకుడు.. మల్టిప్లెక్స్ థియేటర్ ముందు కూర్చొని తన లవర్తో ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఇంతలో కొన్ని యూట్యూబ్ చానెల్స్ వాళ్లు వచ్చి సినిమా ఎలా ఉంది అని అడుగుతారు. నువ్వు ముందు ఫోన్ కట్ చేయి. సినిమాకు వస్తవా? రావా? అంటూ ఫోన్ను కింద పడేసి.. విరగ్గొట్టేశాడు. అయినా కూడా ఫోన్ కట్ కాలేదు. ఇంతలో సినిమా ఎలా ఉందన్నా అని యూట్యూబ్ చానెల్స్ ప్రతినిధులు అడుగుతారు. దీంతో సినిమా సూపర్ హిట్ అన్నా.. నా లవర్ సినిమాకు రమ్మంటే వస్తలేదు అన్నా. ఎంతకోపం వస్తది చెప్పు అంటూ ఫోన్ను కొరకబోయాడు. అక్కడున్నవాళ్లు వద్దు వద్దు అంటూ వారించారు.
నువ్వు ముందు సాయంత్రం సినిమాకు వస్తున్నావా? లేదా? మూడు టికెట్లు తీస్తున్నా.. నాకు, నీకు, ఇంకోటి ఖాళీ సీటు. నీ పక్కన ఎవరూ కూర్చోకుండా.. అని అంటాడు. అయినా కూడా లవర్ సినిమాకు రాను.. అని అంటుందో ఏమో.. దెబ్బకు ఫోన్ను నాలుగు ముక్కలు చేసేస్తాడు. నువ్వు ఫోన్ కట్ చేయ్. ఇంకా కట్ చేయలే.. అంటూ సీరియస్ అవుతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఏ సినిమా.. అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు కదా.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయితే.. రేయ్.. ఎవడ్రా నువ్వు.. ఏందిరా నీ బాధ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

