ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంటారు. అవును.. వీళ్లకు ఆ రోజు.. ఒక పిల్లి రూపంలో వచ్చింది. అదే వాళ్లకు అదృష్ట దేవత అయింది. 10 లక్షల రివార్డు వచ్చేలా చేసింది. కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు నసిర్ షిహాబ్, మహమ్మద్ రషిద్.. దుబాయ్‌లో సెటిల్ అయ్యారు. నసిర్.. బస్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. రషిద్.. కిరాణ కొట్టును నడిపిస్తున్నాడు.
అయితే..రషిద్ కిరాణ కొట్టు పక్కనే పైన రెండో ఫ్లోర్ నుంచి ఓ పిల్లి కింద పడుతుండటం గమనించాడు రషిద్. అప్పుడే షిహాద్ కూడా అక్కడే ఉన్నాడు. వెంటనే ఇద్దరూ కలిసి.. ఓ బెడ్ షీట్ పట్టుకొని.. నిలబడ్డారు. ఆ పిల్లికి పట్టు దొరకక.. రెండో ఫ్లోర్ బాల్కనీ నుంచి కింద పడబోతుండగా.. బెడ్ సీట్‌ను అడ్డంగా పెట్టారు. దీంతో ఆ పిల్లి బెడ్ షీట్లో పడి ప్రాణాలు దక్కించుకుంది. అయితే.. ఆ పిల్లి ప్రెగ్నెంట్‌తో ఉండటంతో.. దాన్ని కాపాడిన ఆ ఇద్దరు ఇండియన్స్‌ను అక్కడి స్థానికులు మెచ్చుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను రషిద్.. తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో దుబాయ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో దుబాయ్ రూలర్.. షేక్ మహమ్మద్ బిన్ రషిద్ కంట పడింది.
ఆ వీడియోను చూసిన షేక్ మహమ్మద్.. పిల్లిని కాపాడిన ఆ ఇద్దరు ఇండియన్స్‌కు 10 లక్షల రివార్డును ప్రకటించాడు.
Proud and happy to see such acts of kindness in our beautiful city.
— HH Sheikh Mohammed (@HHShkMohd) August 24, 2021
Whoever identifies these unsung heroes, please help us thank them. pic.twitter.com/SvSBmM7Oxe
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Guinness World Record : 37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Chain Snatching : పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. మహిళ మెడలోని చైన్‌ను ఎత్తుకెళ్లారు.. వీడియో
తన పెళ్లికి రాలేదని.. ఓ అతిథికి రూ.17 వేల బిల్ పంపించిన నవ వధువు
Slippers :72 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని.. బయటికి వచ్చాక ‘నా చెప్పులు ఏవి?’ అని అడిగాడు
Viral Video : పెళ్లి మండపంలో వధూవరుల పుష్అప్స్.. అతిథులు షాక్… నెటిజన్లు రాక్స్
Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి