కొందరు వెజిటేరియన్లకు.. నాన్ వెజ్ తినేవాళ్లంటే పడదు. వాళ్లకు దూరంగా ఉంటారు. కానీ.. ఇంట్లోనే నాన్ వెజ్ తినేవాళ్లు ఉంటే ఏం చేస్తారు. ఎలాగోలా అడ్జెస్ట్ అవుతారు. లేదంటే వాళ్లతో నాన్ వెజ్ మాన్పిస్తారు. ఓ భర్త కూడా ఇలాగే.. మటన్ అంటే ఇష్టం ఉన్న తన భార్యతో ఎలాగైనా నాన్ వెజ్ తినడం మాన్పించాలనుకున్నాడు. పెళ్లి చేసుకునేటప్పుడే తనకు నాన్ వెజ్ పడదని చెప్పాడు. తను ప్యూర్ వెజిటేరియన్ అని చేసుకోబోయే అమ్మాయికి చెప్పాడు. దీంతో తను.. పెళ్లి తర్వాత మటన్ తినడం మానేస్తానని తన భర్తకు ప్రామిస్ చేసింది.
పెళ్లి తర్వాత తన ప్రామిస్‌ను తుంగలో తొక్కింది. భర్తకు తెలియకుండా సీక్రెట్‌గా మటన్ తినడం స్టార్ట్ చేసింది. బయటికి వెళ్లినప్పుడు ఫుల్లుగా మటన్ మెక్కి వస్తుందని భర్త తెలుసుకున్నాడు. దీంతో ఇంకోసారి తనకు చాన్స్ ఇచ్చాడు. ఇప్పటికైనా మటన్ మానేయాలంటూ కోరాడు. అయినా తను వినలేదు. నాకు మటన్ అంటే ప్రాణం. తినకుండా నేను బతకలేను అని భర్తకు తేల్చి చెప్పింది భార్య. దీంతో భార్యకు అల్టిమేటం జారీ చేశాడు భర్త. నీకు నేను కావాలా? లేక మటన్ కావాలా? తేల్చుకో.. ఆలోచించుకొని సమాధానం చెప్పు.. అంటూ అల్టిమేటం జారీ చేశాడు.
అయితే.. తన భార్య ఏ సమాధానం చెబుతుందోనని ఆ భర్త తెగ టెన్షన్ పడిపోతున్నాడు. ఒకవేళ తను మటన్‌ను సెలెక్ట్ చేసుకుంటే నా పరిస్థితి ఏంటి.. అని అనుకున్నాడు. అందుకే.. న్యూస్‌పేపర్ కాలమిస్టుకు తన సమస్యను రాసి పంపించాడు. అది పేపర్లో ప్రింట్ అయింది. పేపర్లో ప్రింట్ అవడమే కాదు.. ఆ పేపర్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి ఆ కాలమిస్ట్ ఏం సమాధానం చెప్పాడో తెలుసా?
డియర్ ప్యూర్ వెజ్.. నువ్వు సరికొత్త రికార్డును నెలకొల్పావు. ఒక అమ్మాయి.. ఒక మనిషిని లేదా మేకను.. ఈ రెండింట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం తొలిసారి వచ్చింది. అందుకే ఇది ఫస్ట్ లవ్ ట్రయాంగిల్ అయింది. అయితే.. తను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది అని టెన్షన్ పడుతున్నావు కదా. ప్రేమ లేకుండా ఎవ్వరైనా బతకొచ్చు కానీ.. ఫుడ్ లేకుండా బతకలేరు కదా.. తను ఏం సమాధానం చెబుతుందో ఇప్పటికైనా నువ్వు గెస్ చేసి ఉంటావు.. అంటూ ఆ కాలమిస్ట్.. అతడి ప్రశ్నను సమాధానం చెబుతాడు.
ఆ పేపర్ క్లిప్‌ను కాలమిస్టే తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ క్లిప్ వైరల్ అవుతోంది. ప్యార్ చాహియే యా మటన్ చాహియో.. అనే క్యాప్షన్‌తో పెట్టిన పోస్ట్‌పై నెటిజన్లు అయితే ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు.
प्यार चाहिए या मटन चाहिए pic.twitter.com/JFJhRB1pbz
— ParanjoyGuhaThakurta (@paranjoygt) December 1, 2021
This is the solution 🙏 pic.twitter.com/xKv6cjrkqD
— Restricted talk (@Prasanjit125) December 2, 2021
Food loves us unconditional… So one should always choose food and reciprocate the unconditional love…
— fabsheikhکائنات🏹 (@kainatjs) December 2, 2021
She's absolutely goin' to choose mutton. Because, she can get a dozen of lovers in this modern world, as she's beautiful. But, if she leaves eating mutton, she'll not get the taste of mutton again😁😁😁
— Fahad Khan (@fahad_kha9) December 2, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అప్పుడు విడిపోయారు.. ఇప్పుడు కలిశారు.. 35 ఏళ్ల తర్వాత పెళ్లితో ప్రేమజంట శుభం కార్డు
1496 వాషింగ్ మిషన్లతో పిరమిడ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.. ఎందుకో తెలుసా?
King Cobra: బెదిరిపోయి వంటింట్లో జొరబడ్డ కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
Hyderabad | లాక్డౌన్ టైమ్‌లో ప్రాణాలకు తెగించి సేవలందించారు.. నోబెల్‌కు నామినేట్ అయ్యారు
హైదరాబాద్‌లో బడ్జెట్ ధరలో టేస్టీ దోశ, ఇడ్లీ తినాలంటే.. అక్కడికి వెళ్లాల్సిందే