మామా.. ఇక్కడ మంచి టిఫిన్ ఎక్కడ దొరుకుతుందిరా.. అని ఫ్రెండ్స్‌ను ఆరాతీస్తుంటాం. అరె.. ఇక్కడ టిఫిన్స్ ఏం బాగుండవురా.. అని కొందరు అంటారు. అరెయ్.. అక్కడికెళ్తే బాగుంటుందిరా. సూపర్‌గా ఉంటుంది టిఫిన్.. అని ఎక్కడో ఉన్న టిఫిన్ సెంటర్ పేరు చెబుతారు. దానికి కారణం ఏంటి.. టేస్టీగా, నాణ్యతతో టిఫిన్స్ అందిస్తే.. కస్టమర్లు దూరం నుంచి అయినా వచ్చి టిఫిన్ తింటారు అని చెప్పడానికి ఉదాహరణ ప్రగతి టిఫిన్ సెంటర్.
హైదరాబాద్‌లో ఉన్నవాళ్లకు ప్రగతి టిఫిన్ సెంటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. గత 40 ఏళ్ల నుంచి హైదరాబాద్ వాసులకు టేస్టీ టేస్టీ టిఫిన్స్‌ను అందిస్తోంది ఆ టిఫిన్ సెంటర్. హనుమాన్ టెక్డీలో ప్రగతి మహావిద్యాలయాకు దగ్గర్లోనే ఉంటుంది ఈ టిఫిన్ సెంటర్.
మీరు హైదరాబాద్‌లో ఉండి.. ఈ టిఫిన్ సెంటర్లో దోశ కానీ.. ఇడ్లీ కానీ తినలేదంటే మీరు మీ లైఫ్‌లో సూపర్బ్ టేస్ట్‌ను మిస్ అయినట్టే. పలు రకాల దోశలు, ఇడ్లీ, కొబ్బరి చట్నీ, పొడి, సాంబారుకు ఈ టిఫిన్ సెంటర్ పెట్టింది పేరు. ఉదయం 6.30 కే ఈ హోటల్‌ను తెరుస్తారు. రాత్రి 9.30 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు.. ఏ సమయంలో ఈ టిఫిన్ సెంటర్‌కు వెళ్లినా.. ఫుల్లు జనాలు ఉంటారు. అంత పాపులర్ ఈ టిఫిన్ సెంటర్.
ఇక్కడ చాలామంది బటర్ పనీర్ మసాలా దోశను ఎక్కువగా తింటారు. అలాగే ఇడ్లీ కూడా ఫేమస్. కొందరు మసాలా దోశ, ఆనియల్ దోశను ఆర్డర్ చేస్తుంటారు.
ఈ హోటల్‌ను ఇద్దరు అన్మదమ్ములు కుమారయ్య, కనకయ్య 40 ఏళ్ల క్రితమే ప్రారంభించారు. వీళ్ల తండ్రి అప్పట్లో చెరుకు రసం అమ్మేవాడు. దాంతో వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడవాల్సి వచ్చేది. దీంతో ఇద్దరు అన్మదమ్ములు కలిసి.. తండ్రికి తోడుగా ఉండేందుకు ఈ టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించారు.
టిఫిన్ సెంటర్ పెట్టిన మొదట్లో చాలా ఇబ్బందులు వచ్చినా.. గిరాకీ లేకున్నా.. క్విక్ సర్వీస్, బడ్జెట్ ధరలో టిఫిన్లు, క్వాలిటీని మెయిన్‌టెన్ చేస్తూ ఉండటం వల్ల.. ప్రగతి టిఫిన్ సెంటర్‌కు గిరాకీ పెరిగింది. ఇప్పుడు రోజుకు వేల మంది వచ్చి అక్కడ టిఫిన్ తిని వెళ్తుంటారు. హైదరాబాద్‌కు ఏదైనా పనిమీద వచ్చినా.. టూరిస్టులు అయినా సరే.. ప్రగతి టిఫిన్ సెంటర్లో టిఫిన్ తిని వెళ్లాల్సిందే. మీరు కూడా ఏదైనా పనిమీద హనుమాన్ టెక్డీ వెళ్తే.. ప్రగతి టిఫిన్ సెంటర్లో ఓసారి టిఫిన్ టేస్ట్ చేసి రండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం అదే.. పారిస్ కూడా దాని తర్వాతే!
మట్టితో ఇంటిని నిర్మించాడు.. ఆ ఇల్లు స్పెషాలిటీ ఏంటో తెలుసా?
డ్రైవర్లకు పోలీసుల ‘గరమ్ చాయ్’.. ఎందుకంటే?