ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతం అది.. అక్కడి ప్రజలు గడ్డకట్టే చలిని ఎలా తట్టుకుంటారో తెలుసా?.. వీడియో
ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతం అది | మామూలుగా మన దగ్గర 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే తట్టుకోలేం. అబ్బా చలి అంటూ వణికిపోతాం. జీరో డిగ్రీలకు పడిపోతే
మామూలుగా మన దగ్గర 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే తట్టుకోలేం. అబ్బా చలి అంటూ వణికిపోతాం. జీరో డిగ్రీలకు పడిపోతే.. బయటికి రావాలంటేనే భయపడిపోతాం. కానీ.. ఒక చోట మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది తెలుసా? అక్కడ బయటికి వెళ్తే గడ్డకట్టుకుపోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశం అది. అయినా కూడా అక్కడ జనాలు మాత్రం ఆ చలికి అలవాటు అయిపోయారు. ఆ చలిని తట్టుకొని జీవనం సాగిస్తున్నారు.

ఇంతకీ అది ఏ ప్రదేశం అంటారా? రష్యాలో ఉన్న యాకుటియా అనే టౌన్ గురించే మనం మాట్లాడుకునేది. ఆర్కిటిక్ సముద్ర తీరంలో ఉండే ఈ టౌన్ జనాభా 10 లక్షలు. దీన్నే సఖా అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రజల జీవనాధారం చేపల వేటే. చాలామంది చేపల వేట మీద ఆధారపడి జీవిస్తారు. మరికొందరు చిన్నాచితక పనులు చేస్తుంటారు. టూరిజం మీద కూడా ఆధారపడుతుంటారు.
ఇక్కడ ఎప్పుడు చూసినా.. సంవత్సరం మొత్తం కూడా మైనస్ డిగ్రీలలోనే ఉష్ణోగ్రత ఉంటుంది. చలికోటు వేసుకుండా బయటికి వెళ్లారంటే ఇక అంతే. గడ్డకట్టుకుపోవాల్సిందే. అందుకే.. ఇక్కడి ప్రజలు ఎక్కువగా ఇళ్లలోనే ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు. ఒకానొక సందర్భంలో మైనస్ 71 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశం అని పిలుస్తారు.

ఈ టౌన్లో ఎక్కడ చూసినా కూడా మంచు కనిపిస్తుంది. వాహనాలు, ఇళ్లు, రోడ్లు అన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి. ఈ టౌన్‌కు పర్యాటకులు కూడా వస్తుంటారు. అక్కడి అత్యంత చలిని ఎంజాయ్ చేసి వెళ్తుంటారు.
యాకుటియాలో ఉండే చలిని ప్రజలు ఎలా తట్టుకుంటారు.. అక్కడి ప్రజల జీవన శైలి ఎలా ఉంటుంది.. అనే దాని గురించి యాకుటియాకు చెందిన కియున్ బి అనే యువతి తన యూట్యూబ్ చానెల్లో ఓ వీడియోను అప్లోడ్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వామ్మో.. అక్కడ అంత చలి ఉంటుందా? బాబోయ్ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం
అరుదైన రెండు తలల బల్లిని చూశారా ఎప్పుడైనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

