Viral Video | ఇటీవలే కాలంలో దేశరాజధాని ఢిల్లీలో కొందరు (Delhi man) యువత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై ఇష్టానుసారంగా వెళ్తూ.. ఇతర వాహనదారులను ప్రమాదాల్లోకి నెడుతున్నారు. పాదచారులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు ఆటోలో వెళ్తూ విన్యాసాలు ప్రదర్శించాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఓ సైక్లిస్ట్ (cyclist)ను ఢీ కొట్టడంతో అతడు కిందపడిపోయి గాయాలపాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఉత్తర ఢిల్లీలోని సిగ్నేచర్ ఫ్లైఓవర్‌పై ఓ వ్యక్తి రన్నింగ్ ఆటోకు వేలాడుతూ ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో వెనుకకు చూస్తూ చేతులు ఊపుతూ విన్యాసాలు (performing stunt) ప్రదర్శించాడు. ఈ క్రమంలో ముందు సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని తన చేతులతో ఢీ కొట్టాడు. దీంతో సైక్లిస్ట్ రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ తతంగాన్నంతా వెనుక బైక్‌పై వస్తున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది. చివరికి ఈ వీడియో పోలీసులకు దృష్టికి చేరడంతో వారు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు ఆటో నంబర్ ఆధారంగా ఆకతాయిల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read..
Samantha | సమంత ఇంట మొదలైన క్రిస్మస్ సందడి.. పిక్స్ షేర్ చేసిన నటి
Hyderabad CP | హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి
రాజమౌళి, మహేశ్‌బాబు సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారంటే..