సినిమాలు తీసే విషయంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. కొందరు బౌండ్ స్క్రిప్ట్‌తో వెళ్తారు. కొందరు లొకేషన్లో సీన్లు రాసుకొని షూట్ చేస్తుంటారు. కొందరు ఏ షెడ్యూల్‌కి ఆ షెడ్యూల్ సీన్లతో చిత్రీకరణ జరుపుతుంటారు. ఇలా ఎవరి శైలి వాళ్లది. లెజెండ్రీ డైరెక్టర్ రాజమౌళి షూటింగ్ కంటే, ప్రీ ప్రొడక్షన్‌కే ఎక్కువ టైమ్ తీసుకుంటారు.
లొకేషన్కెళ్లాక ఫుల్ క్లారిటీతో సినిమాలు తీస్తారు కాబట్టే ఇప్పటివరకూ ఒక్క అపజయం కూడా లేకుండా ఇండియాలోనే నంబర్‌వన్ దర్శకుడు కాగలిగారు రాజమౌళి. ఇప్పుడు ఇదంతా దేనికంటే.. మహేశ్‌తో రాజమౌళి చేయబోతున్న సినిమాపై ఓ ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతున్నది. ఈ సినిమా షూటింగ్‌ను జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే రాజమౌళి ప్రారంభించనున్నట్టు. 2025లోపే ఈ సినిమా మొదటి పార్ట్‌ని విడుదల చేయనున్నట్టు ఓ వార్త సారాంశం.
అందులో నిజానిజాలు పక్కన పెడితే, ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న మాట అయితే వాస్తవం. ఈ సినిమాకోసం ఇప్పటికే మహేశ్ కసరత్తులు మొదలుపెట్టారు. అంతేకాదు, హాలీవుడ్ యాక్షన్ ట్రైనర్‌తో కఠోరమైన శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. కథ రిత్యా ఇది అమేజాన్ నదీ పరివాహక ప్రాంతంలోని దట్టమైన కీకారణ్యంలో జరిగే యాక్షన్ అడ్వంచరస్ మూవీ . రీసెంట్గా రాజమౌళి టీమ్ లొకేషన్స్ కూడా చూసిరావడం జరిగిందని టాక్. ఇక షూటింగ్ విషయానికొస్తే, రాజమౌళి బౌండ్ స్క్రిప్ట్‌తోనే లొకేషన్‌కి వెళతారు. మరి ఆ విషయం గురించి ఇప్పటివరకూ క్లారిటీ లేదు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.