ఇది వరకు అంటే కరోనాకు ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అది కేవలం ఐటీ సెక్టార్ ఉద్యోగులకు మాత్రమే ఉండేది. కానీ.. నేడు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం కరోనా మహమ్మారి. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ నుంచి ప్రపంచం కోలుకుంటోంది. దీంతో పలు కంపెనీలు తిరిగి ఉద్యోగులను ఆఫీసులకు రావాలంటూ కోరుతున్నాయి.
యూకేలో కూడా కరోనా సద్దుమణిగింది. కేసులు ఎక్కువగా లేవు. దీంతో.. ఆఫీసులకు రావాలంటూ ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర ప్రైవేటు కంపెనీలు.. తమ ఉద్యోగులను కోరుతున్నాయట.
రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు ఆఫీసులకు రావాలంటూ కంపెనీలు కోరుతున్నాయి. కానీ.. యూకేలో చాలామంది ఉద్యోగులు.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికే ఇంకా ఆసక్తి చూపిస్తున్నారట. ఆఫీసులకు వెళ్లడానికి బద్ధకిస్తున్నారట.
అందుకే.. లండన్‌లోని టాప్ కంపెనీలు ఉద్యోగులకు వరాలు అందిస్తున్నాయి. ఆఫీసుకు వచ్చి పనిచేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే లండన్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ.. ఉద్యోగులు మాత్రం ఆఫీసు అనే సరికి.. ససేమిరా అంటున్నారు.
కొన్ని బ్యాంకింగ్ సంస్థలు అయితే.. ఉచితంగా లంచ్ ప్రొవైడ్ చేస్తామని.. బార్బెక్ కూడా ఉంటుందని ఉద్యోగులను నోరూరిస్తున్నారు. నైట్ ఫ్రాంక్ అనే ఓ కంపెనీ.. రూఫ్‌టాప్ బార్బెక్ అందిస్తున్నట్టు కంపెనీ ఉద్యోగులకు వెల్లడించింది. వీసీసీపీ అనే మరో కంపెనీ.. ఏకంగా బరిస్టానే ఆఫీసులో పెట్టేసింది. రోజూ ఉచితంగా బ్రేక్ ఫాస్ట్ తినొచ్చని స్పష్టం చేసింది. యూకేలో వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తీసేసి.. ఉద్యోగులంతా ఆఫీసులకు వెళ్లాలంటూ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కంపెనీలన్నీ ఇలా ఉద్యోగుల వెంట పడుతున్నాయి. బాబ్బాబు.. ఆఫీసులకు రండి.. ఉచితంగా వచ్చే బెనిఫిట్స్ పొందండి.. అంటూ ఆఫర్లతో అట్రాక్ట్ చేస్తున్నాయి.
ఇండియాలో కూడా టాప్ ఐటీ కంపెనీ.. టీసీఎస్ త్వరలోనే సగం మంది ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ ఆఫీసుకు పిలవనున్నట్టు తెలుస్తోంది. 2021 చివరి వరకు.. 70 నుంచి 80 శాతం వరకు ఉద్యోగులను ఆఫీసులకు పిలుస్తామని కరోనా పరిస్థితులను అంచనా వేసి.. దశల వారీగా.. వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కూడా ఎత్తేసే అవకాశాలు ఉండొచ్చని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : ఈ ఎర్ర బెండకాయలు చాలా కాస్ట్లీ గురూ.. కిలో ధర ఎంతో తెలుసా..?
Costly Cottage : ఏమీ లేని ఈ కాటేజ్‌కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?
Barbie doll : బార్బీ డాల్‌లా కనిపించాలని.. ఈ అమ్మడు ఏం చేసిందంటే..?