Bird Photographer of the Year 2021 : పక్షుల ఫోటోగ్రఫీ.. అవార్డ్స్ గెలుచుకున్న ఈ ఫోటోలను చూసి ఫిదా కావాల్సిందే..!
పక్షుల ఫోటోగ్రఫీ | చాలామందికి వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. పెద్ద పెద్ద కెమెరాలు వేసుకొని.. అడువుల వెంట తిరుగుతూ ఉంటారు కొందరు ఫోటోగ్రఫీ ఔత్సాహికులు. పుట్టలు, గుట్టల వెంట రోజుల తరబడి తిరిగి.. అక్కడి జంతువుల ఫోటోలను తమ కెమెరాల్లో బంధిస్తుంటారు.

Bird Photographer of the Year 2021 : చాలామందికి వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. పెద్ద పెద్ద కెమెరాలు వేసుకొని.. అడువుల వెంట తిరుగుతూ ఉంటారు కొందరు ఫోటోగ్రఫీ ఔత్సాహికులు. పుట్టలు, గుట్టల వెంట రోజుల తరబడి తిరిగి.. అక్కడి జంతువుల ఫోటోలను తమ కెమెరాల్లో బంధిస్తుంటారు. కొందరికి స్పెషల్‌గా బర్డ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉంటుంది. పక్షులను ఫోటోలు తీస్తూ ఉంటారు. అయితే.. మిగితా జంతువుల ఫోటోగ్రఫీతో పోల్చుకుంటే.. పక్షుల ఫోటోలు తీయడం అంత సులువు కాదు. ఎందుకంటే.. అవి ఒకచోట ఉండవు. అటూ ఇటూ ఎగురుతుంటాయి. అలాగే.. ఎలాంటి శబ్దాలు చేయకుండా.. చాలా సేపు వెయిట్ చేస్తేనే.. బెస్ట్ ఫోటోలను తీసే చాన్స్ ఉంటుంది. తాజాగా.. బర్డ్ ఫోటోగ్రఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డులను ప్రకటించారు. దాదాపు 22000 ఎంట్రీలు వచ్చాయి. అందులో అవార్డులను గెలుచుకున్న.. జ్యూరీ సభ్యుల మనసును గెలుచుకున్న కొన్ని అద్భుతమైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం.

Road Runner
రోడ్ రన్నర్ అనే పక్షికి సంబంధించిన ఫోటో ఇది. యూఎస్, మెక్సికో మధ్య సౌత్ అరిజొనాలో ఉన్న 3000 కిలోమీటర్ల అతి పొడవైన బార్డర్ దగ్గర ఈ పక్షి సడెన్‌గా ఆగిపోయింది. ఈ పక్షి సాధారణంగా.. ఒక చోటు నుంచి మరో చోటుకు వలస వెళ్తూ ఉంటుంది. అందుకే వీటిని సంచార జాతి పక్షులు అంటారు. అయితే.. ఆ బార్డర్.. ఇలాంటి పక్షుల సహజత్వాన్ని మార్చేస్తాయని చెప్పేలా ఉన్న ఈ ఫోటోను తీసింది అలెజాండ్రో ప్రీటో.

Portfolio Award
ఇది పఫ్ఫిన్ అనే పక్షి. నార్త్ స్కాట్లాండ్కు వెళ్తున్న సమయంలో కెవిన్ మోర్గాన్స్ అనే ఫోటోగ్రఫర్.. ఈ ఫోటోను తీశాడు. బ్యాక్ గ్రౌండ్లో సూర్యాస్తమయం అవుతుండగా.. పక్షి తన రెక్కలు విడిల్చి నిలుచున్న ఫోటో అది.

Attention to Detail
ఈ ఫోటోలో ఉన్నది పెంగ్విన్. బలంగా గాలులు వీస్తున్న సమయంలో.. అలలు, వర్షపు నీళ్లు.. కలిసి.. ఆ పెంగ్విన్‌ను చుట్టేసిన సమయంలో.. దాని ప్రతిబింబాన్ని రఫెల్ అర్మడా అనే ఫోటోగ్రఫర్ ఈ ఫోటోను తీశాడు.

Conservation Award
కొంగ జాతికి చెందిన అడ్జుటాంట్ అనే పక్షి ఇది. ఈ జాతికి చెందిన పక్షులు.. కనుమరుగైపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతికి చెందిన కొంగలు.. కేవలం 1200 వరకు మాత్రమే ఉన్నాయట. ఇవి అస్సాంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఫోటోను కార్లా రోడెస్ అనే ఫొటోగ్రఫర్ ఈ ఫోటోను తీశాడు.

Best Portrait
ఈ ఫోటోను చూస్తుంటే.. ఇదేదో సముద్రంలో ఉండే తిమింగలంలా అనిపిస్తోంది కదా. కానీ.. అది పెలికాన్ పక్షి. సముద్రంలో జాలర్లు విసిరే చేపల ముక్కల కోసం ఇవి ఇలా నీళ్లలోకి వెళ్తుంటాయి. ఈ ఫోటోను కోస్టారికాలో పసిఫిక్ కోస్ట్‌లో ఫెలిపె ఫొన్సుయెవా తీశాడు.

Bird Behaviour
దీన్ని సన్‌బర్డ్ అంటారు. వెస్ట్ బెంగాల్లో ఈ జాతి పక్షులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా అరటిచెట్టు మీద నివసిస్తుంటాయి. అరటి పువ్వులోని మకరందాన్ని తాగి ఇవి ఆ చెట్టు మీదనే విశ్రాంతి తీసుకుంటాయి. దీన్ని మౌసమ్ రాయ్ అనే ఫోటోగ్రఫర్ తీశాడు.

Black and White
అంటార్కిటికాలో అతి పెద్ద మంచుకొండ మీద కూర్చొని ఉన్న పెంగ్విన్ ఫోటో ఇది. దీన్ని రెనాటో గ్రెనియెరీ అనే ఫోటోగ్రఫర్ తీశాడు.

Urban Birds
ఈ పక్షి పేరు డిప్పర్. గ్రేటర్ మాంచెస్టర్‌లో తీసిన ఫోటో ఇది. నదిలో లెన్స్ పెట్టి.. నది ఒడ్డున నిలబడి రిమోట్ కెమెరాతో తీసిన ఫోటో ఇది. దీన్ని టెర్రీ విట్టాకెర్ తీశాడు.

Young Bird Photographer of the Year (age 14-17)
లెవి ఫిట్జ్ అనే ఫోటోగ్రఫర్ ఈ ఫోటోను తీశాడు. ఈ ఫోటో యంగ్ బర్డ్ ఫోటోగ్రఫర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును గెలుచుకుంది. కోడి ఉదయమే తెల్లారే సమయానికి కూస్తుంది అనే విషయం తెలుసు కదా. అందుకే.. ఆల్ప్స్ పర్వతాలు ఎక్కి మరీ.. ఉదయం 4 గంటలకు కూసే బ్లాక్ గ్రౌజ్ అనే జాతికి చెందిన కోడి ఫోటోను తీశాడు. ఈ జాతికి చెందిన మగ కోళ్లు.. ఉదయమే కూత కూసి అన్నీ కలిసి గుంపులుగా ఆహారం కోసం వేట ప్రారంభిస్తాయి.

Young Bird Photographer of the Year (age 9-13)
ఆంగిల్ అనే పక్షి ఫోటో ఇది. ఇది నీళ్ల కోసం ఇలా చెట్లను దిగి కిందికి వస్తుంటాయి. ఈ ఫోటోను చెట్టు కింద దాక్కొని ఫోటోగ్రఫర్ ఆండ్రెస్ బ్లాన్కో తీశాడు. ఈ ఫోటోకు కూడా యంగ్ బర్డ్ ఫొటోగ్రఫర్ అవార్డు వచ్చింది.
www.birdpoty.com అనే వెబ్సైట్లో ప్రతి క్యాటగిరీ నుంచి గెలిచిన బెస్ట్ ఫోటోలను, విన్నర్స్‌ను చూడొచ్చు. ఒకవేళ మీరు కూడా ఈ కాంపిటిషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే.. 2022 కాంపిటిషన్లో పాల్గొనవచ్చు. దాని కోసం 30 సెప్టెంబర్ 2021 దాకా వెయిట్ చేయాల్సిందే. అన్ని రంగాలకు సంబంధించిన ఫోటోగ్రఫర్లు ఈ కాంపిటిషన్‌కు అర్హులే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
Costly Cottage : ఏమీ లేని ఈ కాటేజ్‌కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?
bullettu bandi | బుల్లెట్టు బండి పాట పాడింది మోహన.. మరి రాసింది ఎవరో తెలుసా?
Prawn Biryani | హైదరాబాదీ బిర్యానీల్లో నయా ట్రెండ్ రొయ్యల బిర్యానీ.. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

