President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
President Droupadi Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజల పాటు ఒడిశాలో పర్యటించాల్సి ఉన్నది. అయితే ఆ రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో తుఫాన్ ఏర్పడే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా పడింది.
భువనేశ్వర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజల పాటు ఒడిశాలో పర్యటించాల్సి ఉన్నది. అయితే ఆ
రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో తుఫాన్ ఏర్పడే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా పడింది. (President Droupadi Murmu) అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కావాల్సిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా పర్యటన వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. ‘ప్రతికూల వాతావరణ సూచనలు, భద్రతా జాగ్రత్తల దృష్ట్యా రాష్ట్రపతి పర్యటనను వాయిదా వేశాం’ అని ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి చెందిన ఒక అధికారి పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 28, 29 తేదీల్లో ఒడిశాలోని రైరంగపూర్తో పాటు సొంత జిల్లా అయిన మయూర్భంజ్ను సందర్శించాల్సి ఉన్నది. అయితే మయూర్భంజ్ జిల్లా యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రపతి పర్యటన రద్దు కాలేదు. కేవలం తేదీలు మాత్రమే మారాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 4, 5 తేదీల్లో మయూర్‌భంజ్‌లో పర్యటిస్తారని ఆ అధికారి వివరించారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం తెలిపింది. అక్టోబర్ 28 ఉదయానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మధ్య ఎక్కడో ఒకచోట తీరం దాటవచ్చని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

