Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Mamma Mia | టాలీవుడ్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూ, వైవిధ్యమైన రొమాంటిక్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫీల్ గుడ్’. తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ‘మమ్మా మియా’ పూర్తి పాటను విడుదల చేసి సంగీత ప్రియులను అలరించింది.
Mamma Mia | టాలీవుడ్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూ, వైవిధ్యమైన రొమాంటిక్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫీల్ గుడ్’. తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ‘మమ్మా మియా’ పూర్తి పాటను విడుదల చేసి సంగీత ప్రియులను అలరించింది. విశ్వరూప ఫిల్మ్స్ బ్యానర్‌పై దయానంద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. సుచిత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సుచిత్, అదితి త్రిపాఠి జంటగా నటిస్తూ తమ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు.
ప్రేమలోని మాధుర్యాన్ని, స్నేహంలోని సరదాలను, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా ఈ గీతాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. నేటి యువత అభిరుచులు మరియు ట్రెండ్‌కు తగ్గట్టుగా ‘వైబ్’, ‘సింక్’, ‘ట్రెండ్’, ‘హైప్’ వంటి యూత్‌ఫుల్ పదాలతో సాగే ఈ పాట యువతను ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ చేసుకునేలా ఉంది. యువతను ఉర్రూతలూగించే బాణీలతో పాటు ఉత్సాహభరితమైన పదప్రయోగం ఈ పాటకు ప్రధాన ప్రత్యేకతగా నిలిచాయి.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు శాండిల్య పిసపాటి అందించిన బాణీలు ఎంతో క్యాచీగా ఉండగా, కడలి సత్యనారాయణ అందించిన అర్థవంతమైన సాహిత్యం పాటకు మరింత వన్నె తెచ్చింది. ఇక సింగర్స్ తుషార నిలయ మరియు శాండిల్య పిసపాటి తమ శక్తివంతమైన, మధురమైన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా సుచిత్, అదితి త్రిపాఠితో పాటు రావూరి ప్రియాంక, లిఖిత్, రణధీర్ వాసుదేవ్, సాయిఫణి, దివ్య మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ‘మమ్మా మియా’ పాట విడుదలతో ‘ఫీల్ గుడ్’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని, ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో కచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ చిత్రానికి బ్యానర్: విశ్వరూప ఫిల్మ్స్, తారాగణం: సుచిత్, అదితి త్రిపాఠి, రావూరి ప్రియాంక, లిఖిత్, రణధీర్ వాసుదేవ్, సాయిఫణి, దివ్య మోహన్ తదితరులు, కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: దయానంద్, నిర్మాత: సుచిత్, సంగీత దర్శకుడు: శాండిల్య పిసపాటి, సాహిత్యం: కడలి సత్యనారాయణ, గాయనీగాయకులు: తుషార నిలయ, శాండిల్య పిసపాటి, డీవోపీ: మహికాంత్, ఎడిటర్: దయానంద్, ఆర్ట్ డైరెక్టర్: రాంగోపాల్ రెడ్డి, మార్కెటింగ్ & పీఆర్ఓ: కోదాది శ్రీధర్ – అశోక్ దయ్యాల, ఫీనిక్స్ స్టూడియోస్ వ్యవహరిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

