Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Bhargav Desh Pande | కాంగ్రెస్ అవినీతి పద్దతిలో జనాల మీద, బిల్డర్ల మీద, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ట్యాక్స్ వేస్తుంది.. వ్యాపారం చేద్దామనుకున్న ఏ ఒక్క ఆలోచన వచ్చిన తెలంగాణ వ్యక్తి మీద ఏ రకంగా చేస్తుందో తెలుస్తుందన్నారు.
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఏ శక్తులు రాజ్యమేలుతున్నాయనేది చూసుకోండి.. పూర్తిగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, తెలుగుదేశం భావజాలం కలిగిన వ్యక్తులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేస్తున్నారన్నారని మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే ఆరోపించారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో భార్గవ్ దేశ్‌పాండే మీడియాతో మాట్లాడుతూ.. ఈ పద్దతుల్లో ఈ భావజాలాలు కలిగిన నాయకులు.. కిరాయి నాయకులు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టేలా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు దిగజారుతున్నాయన్నారు.
సరే నేను వదిలిపెట్టి పోతున్న మిమ్మల్ని.. కానీ రేపటి రోజు నా మాటలను గుర్తు పెట్టుకోండి.. రాహుల్‌గాంధీ దీంతో మీకు, కాంగ్రెస్ పార్టీ భారీ నష్టం జరుగతదని చెప్పి పోతున్నా. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి రైతులను నట్టేట ముంచిన మోసం.. చివరి మూడేళ్లలో ఈ ముఖ్యమంత్రి ఘనత. ఈ రోజు నేనే కాదు.. నా మిత్రులు.. ఆదిలాబాద్‌లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో అంటే ఒక రకమైన ఊరట.. ఈ రాక్షస పాలనలో మనం భాగం కానిది నయం అయింది.. మేం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంక శాశ్వతంగా స్వస్తి చెప్తామనే ఆలోచనలో ఉన్నామన్నారు.
ఎంతసేపు వాళ్లను, వీళ్లను తిట్టడమే..
ముఖ్యమంత్రి వైఖరి ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ప్రభుత్వంలోకి వచ్చారు.. ప్రజలు మీకో అవకాశం ఇచ్చిర్రు.. మూడేళ్లుగా మీరు చేస్తున్నదేంటంటే అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి ఎంత సేపు వాళ్లను తిట్టాలే.. వీళ్లను తిట్టాలే.. ఇంతకుముందు పరిపాలించినోళ్లను తిట్టాలేనని భార్గవ్ దేశ్ పాండే ఎద్దేవా చేశారు. మీరు ఏం చేయగలుతరో చేయండి.. అని మీకు అవకాశం ఇచ్చారు.. అంతేకానీ ఎంతసేపు వాళ్లను, వీళ్లను తిట్టడానికి ముఖ్యమంత్రి సమయం కేటాయిస్తున్నాడే తప్ప.. ఏ రకమైన అభివృద్ధి మీద వాళ్ల దృష్టి పోవడం లేదు.. ఈ రోజు ఈ రకమైన పరిపాలన జరుగుతుంది.. బయట ఏ చిన్న పిల్లగాడిని అడిగినా కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి.. కాంగ్రెస్ అవినీతి పద్దతిలో జనాల మీద, బిల్డర్ల మీద, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ట్యాక్స్ వేస్తుంది.. వ్యాపారం చేద్దామనుకున్న ఏ ఒక్క ఆలోచన వచ్చిన తెలంగాణ వ్యక్తి మీద ఏ రకంగా చేస్తుందో తెలుస్తుందన్నారు.
టీడీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలాలు కలిగిన నాయకులు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు.
రానున్న రోజుల్లో ఈ నాయకుల వల్ల కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందని రాహుల్ గాంధీని హెచ్చరిస్తూ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోతున్నాను.
– మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
— Telugu Scribe (@TeluguScribe) October 24, 2026
Read Also :
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

