Jamia Millia Islamia | ఎన్నికల కోసం జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన.. భద్రతా సిబ్బందితో ఘర్షణ
Jamia Millia Islamia | దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. విద్యార్థి సంఘం ఎన్నికల డిమాండ్‌తో విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ఆ టెంట్లను తొలగించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించడంతో ఘర్షణకు దారితీసింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. విద్యార్థి సంఘం ఎన్నికల డిమాండ్‌తో విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ఆ టెంట్లను తొలగించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించడంతో ఘర్షణకు దారితీసింది. (Jamia Millia Islamia) 2006లో క్యాంపస్‌లో హింస చెలరేగడంతో జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్ యూనియన్ (జేఎంఐఎస్యూ)ను రద్దు చేశారు. నాటి నుంచి విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించలేదు.
కాగా, విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని, స్టూడెంట్స్ యూనియన్ను పునరుద్ధరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 12 నుంచి క్యాంపస్‌లో నిరసనలు మొదలయ్యాయి. శుక్రవారం కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, ఇమ్రాన్ మసూద్‌లు గోడ దూకి క్యాంపస్‌లోకి ప్రవేశించడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
అయితే శనివారం విద్యార్థులు నిరసన తెలుపుతున్న, కొందరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టెంట్లను తొలగించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. విద్యార్థులు అడ్డుకోవడంతో భద్రతా సిబ్బంది, వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో క్యాంపస్‌లో గందరగోళం చెలరేగింది. అలాగే యూనివర్సిటీ గోడలపై దేశ వ్యతిరేక నినాదాలు కనిపించాయి. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన ఈ నినాదాలపై విచారణ జరుపాలని బీజేపీ డిమాండ్ చేసింది.
మరోవైపు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు క్యాంపస్‌లోకి ప్రవేశించి, విద్యార్థులను రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాలకు వారిని బలిపశువులుగా మార్చారని జామియా రిజిస్ట్రార్ మహతాబ్ ఆలం రిజ్వీ ఆరోపించారు. ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్యాంపస్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో క్లాస్‌ల నిర్వహణను ఆన్‌లైన్‌కు మార్చినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jamia Millia Islamia | ఎన్నికల కోసం జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన.. భద్రతా సిబ్బందితో ఘర్షణ
రుద్ర వాణి గాయత్రికి ఎంజీయూ డాక్టరేట్
Earthquake | వనువాటు తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

