Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Chilling video : మహారాష్ట్రలో దారుణ హత్య జరిగింది. ఛత్రపతి శంబాజీనగర్‌లో, గురువారం అందరూ చూస్తుండగా, నడిరోడ్డుపై ఒక వ్యక్తిని కర్ర, ఇనుపరాడ్‌తో కొట్టి చంపాడు.
Chilling video : మహారాష్ట్రలో దారుణ హత్య జరిగింది. ఛత్రపతి శంబాజీనగర్‌లో, గురువారం అందరూ చూస్తుండగా, నడిరోడ్డుపై ఒక వ్యక్తిని కర్ర, ఇనుపరాడ్‌తో కొట్టి చంపాడు. ఈ హత్య ఘటనను ప్రత్యక్షంగా చూసిన వాళ్లు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనలో మృతుడిని దేవేష్ అలియాస్ బంటీ దీక్షిత్ (36)గా, నిందితుడిని పవన్ పరాషర్ (22)గా గుర్తించారు. స్థానిక వాఖెండే నగర్లో నివాసం ఉంటున్న దేవేష్ ఉదయం జిమ్ సెషన్‌నుంచి బైకుపై వస్తుండగా.. కారులో పవన్ వెంబడించాడు. అతడు తప్పించుకునేందుకు ప్రయత్నించినా పవన్ కారుతో అతడిని అనుసరించాడు. చివరకు సిడ్కో పరిధిలోని ఎన్-7 ఏరియాలో, ఒక గ్యాస్ ఏజెన్సీ వద్దకు రాగానే.. దేవేష్ బైకును కారుతో ఢీకొట్టాడు. దీంతో అతడు అక్కడే పడిపోయాడు. ఈ ఘటనలో బైకు కిందపడి చాలా దూరం దూసుకెళ్లింది. అంటే, అంతవేగంగా పవన్.. ఆ బైకును ఢీకొట్టాడు.
🚨 महाराष्ट्र में दिनदहाड़े खूनी हमला आखिर कानून का डर कहाँ है?
महाराष्ट्र के छत्रपति संभाजीनगर में एक युवक की बेरहमी से हत्या किए जाने की खबर बेहद चिंताजनक है। बताया जा रहा है कि कार से स्कूटर को टक्कर मारने के बाद युवक पर हॉकी स्टिक और लोहे की रॉड से हमला किया गया, जिससे उसकी मौके पर ही मौत हो गई।
आखिर पुरानी रंजिश में कोई इंसान इतना हैवान कैसे बन सकता है? सरेआम ऐसी वारदातें कानून-व्यवस्था पर गंभीर सवाल खड़े करती हैं!
गुनहगारों को सख्त सजा मिले और पीड़ित परिवार को न्याय मिले। सड़कें दुश्मनी निकालने का मैदान नहीं हैं
#Maharashtra #ChhatrapatiSambhajinagar #CrimeNews #JusticeForVictim
— Sahil chabra (@sahii199) October 23, 2026
అప్పటికే దేవేష్కు కిందపడగా గాయాలయ్యాయి. అనంతరం పవన్ కారుతో మళ్లీ వచ్చాడు. గాయపడ్డ అతడిపై కారు దిగి దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కర్ర, ఇనుపరాడ్‌తో తలపై విచక్షణారహితంగా కొట్టాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం నిందితుడు నేరుగా కారుతో వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గతంలో ఇద్దరూ బౌన్సర్లుగా చేసే వారమని, మంచి స్నేహం ఉండేదని, అయితే, తర్వాత ఇద్దరి మధ్య విబేధాల కారణంగా శతృత్వం పెరిగిందన్నాడు. ఈ కారణంగానే దాడి చేసి చంపినట్లు పవన్ పోలీసులకు వివరించాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. నిందితుడి నుంచి సరైన వివరాలు రాబట్టాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Jamia Millia Islamia | ఎన్నికల కోసం జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన.. భద్రతా సిబ్బందితో ఘర్షణ
రుద్ర వాణి గాయత్రికి ఎంజీయూ డాక్టరేట్
Earthquake | వనువాటు తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

