Auto Rickshaw | ఆటో రిక్షా (Auto Rickshaw).. దీని గురించి తెలియని వారు ఉండరు. భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రజా రవాణా వాహనం. మనకు ప్రయాణ సమయంలో వెంటనే అందుబాటులో ఉండేది ఆటోనే. అయితే, ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా సొంత రవాణాను వినియోగించడం, బస్సులు, మెట్రోలు, ఊబర్ రైడ్స్ వంటి ఇతర కారణాల వల్ల ఆటోవాలాల హవా కాస్త తగ్గింది. దీంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆటో డ్రైవర్లు (Auto Drivers) వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. తమ మూడు చక్రాల వాహనాన్ని అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అందులో ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఫ్యాన్, మినీ కూలర్, వైఫై, తాగేందుకు మంచి నీళ్లు వంటి సౌకర్యాలతో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా చెన్నై (Chennai )కి చెందిన ఓ ఆటోవాలా కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. ఏకంగా తన మూడు చక్రాల వాహనాన్ని ఓ మినీ జంగిల్ (Mini Jungle)లా మార్చేశాడు. మొత్తం గ్రీనరీతో నింపేశాడు. పచ్చని మొక్కలతో ఆటో లోపల మొత్తం ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆటోవాలా సృజనాత్మకతకు ఫిదా అవుతున్నారు. ఈ ఆటో ‘ట్రావెలింగ్ పార్క్’ (travelling park), ‘ఇదో మినీ గార్డెన్’ (Mini Garden), ‘గ్రీన్ ఆటో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ‘అతను జంగిల్ సఫారీని సీరియస్‌గా తీసుకున్నట్లున్నాడు’ అంటూ చమత్కరిస్తున్నారు. లైటింగ్ ఆటో రిక్షాలను చూశాను కానీ, ఇలా పూలతో కూడినది చూడటం ఇదే మొదటిసారి అంటూ మరికొందరు అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం అంత అందమైన మినీ గార్డెన్ ఆటోను మీరూ చేసేయండి.
Also Read..
Parliament Sessions | ఐదురోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. కేంద్రం కీలక ప్రకటన
Elon Musk | ట్విట్టర్లో ఇక ఆడియో, వీడియో కాల్ సదుపాయం : ప్రకటించిన మస్క్
G20 Summit | జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దూరం..!