నేటి యూత్ ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అంతకుమించి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వాళ్లు ఏది చేసినా కాస్త డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. కొందరు తన పెళ్లిళ్ల విషయంలోనూ కొత్తదనాన్నే కోరుకుంటున్నారు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయడం లాంటివి కూడా ఆ తరహావే.
సాధారణంగా పెళ్లికొడుకు కానీ.. పెళ్లికూతురు కానీ పెళ్లిమండపంలోకి ఎలా ఎంట్రీ ఇస్తారు. కారులో ఎంట్రీ ఇస్తారు కదా. కానీ.. ఈ పెళ్లికొడుకు చూడండి.. ఏకంగా సైకిల్ మీద ఎంట్రీ ఇచ్చాడు. సైకిల్ మీద ఎంట్రీ ఇచ్చిన పెళ్లికొడుకును చూసి పెళ్లికొచ్చిన బంధువులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అయితే.. ఆ పెళ్లికొడుకు సైకిల్‌పై ఎంట్రీ ఇవ్వడం వెనుక పెద్ద కారణమే ఉంది. అతడి పేరు దినేశ్ సేల్. హైదరాబాద్‌లో హ్యాపీ హైదరాబాద్ అనే సైక్లింగ్ కమ్యూనిటీని ప్రారంభించాడు. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఖచ్చితంగా ప్రతిఒక్కరు సైకిల్ తొక్కాలని.. సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి అందరికీ అవగాహన కల్పించడం కోసం దినేశ్ ఇలా సరికొత్తగా తన పెళ్లి రోజున పెళ్లిమండపానికి సైకిల్ తొక్కుతూ వచ్చాడు.
తన కమ్యూనిటీలో ఉన్న ఫ్రెండ్స్ కూడా సైకిల్ మీదే దినేశ్ పెళ్లికి వచ్చారట. అంతే కాదు.. పెళ్లికొడుకు, పెళ్లి కూతురుకు గిఫ్ట్‌గా ఒక సైకిల్‌ను ఇచ్చారట. ఆ సైకిల్‌ను తొక్కి ఆరోగ్యంగా ఉండాలని దీవించారట. ప్రస్తుతం దినేశ్ సైకిల్ మీద పెళ్లి మండపానికి వచ్చిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా దినేశ్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి దినేశ్.. ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం చేస్తున్న కృషికి శభాష్ అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఫోన్లకు చార్జింగ్ పెట్టుకుంటే జీతం కట్.. ఉద్యోగులకు బాస్ అల్టిమేటం
Prakash Raj : ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన మీమ్ వైరల్
ఈ పిల్లాడి ముందు స్టార్ హోటల్ చెఫ్ కూడా పనికిరాడు.. వైరల్ వీడియో
అక్కడ వారానికి నాలుగు రోజులే పని.. జీతం కూడా కట్ చేయరు
తల్లికి డెలివరీ చేసి తన పుట్టుకకు కారణం అయిన డాక్టర్‌పై కేసు పెట్టిన యువతి