Station Ghanpur | జనగామ : జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండల కేంద్రంలో కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్లుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వారి వర్గం పెత్తనం ఉంది. 15 సంవత్సరాలుగా ఈ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. మొన్నటి ఎన్నికలలో కొద్దిపాటి తేడాతో ఓడిపోయాం. అయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ సదయ్య గౌడ్ మాట్లాడుతూ.. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. నియోజకవర్గం ఇంచార్జి సింగపురం ఇందిర మీద విశ్వాసంతో నామినేటెడ్ పదవుల్లో కానీ స్థానిక ఎన్నికల్లో తమకు సరైన గుర్తింపు వస్తుందనే ధీమా ఉండేది. కానీ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తమ ఆశలన్నీ అడియాశలయ్యాయి. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. తనకి భజన చేసిన వారికి పదవులు దక్కితే ఇక మా పరిస్థితి ఏంటి..? తమ బాధలు ఎవరితో చెప్పుకోవాలనే సందిగ్ధంలో పడిపోయాము. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగితే ఊరుకోబోమని హెచ్చరించారు. కడియం శ్రీహరి కబంధహస్తాల నుండి విముక్తులను చేయాలని ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంచార్జి సింగపురం ఇందిర, మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మీరైనా మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ తాటికాయల శరత్ బాబు, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జీ రడపాక రాజ్ కుమార్, మండల సీనియర్ నాయకులు బానోతు లచ్చిరాం, గ్రామ శాఖ అధ్యక్షులు బానోతు బిక్షపతి, ఓరుగంటి రాజు, కైరీక మల్లయ్య, మాజీ ఉప సర్పంచ్ నంచర్ల లేత యాదగిరి, తిరుపతి, మర్రి రమేష్, ఉల్లి శివరాజ్, కుక్కల ఎల్లయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు సుమన్, రాజు, రాజేందర్, భాస్కర్, అఖిల్, యజాస్, బాబు, ఎల్లయ్య, నర్సయ్య, భాస్కర్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | పేపర్ లీకులు తప్ప.. బండి సంజయ్‌కు గ్రూప్-1 గురించి ఏం తెలుసు..! కేటీఆర్ ఎద్దెవా
KTR | గ్రూప్-1 అభ్యర్థులను పశువుల మాదిరిగా చూడడం దారుణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
BRS Party | రైతుబంధుకు రాం రాం.. రేపు అన్ని మండల కేంద్రాల్లో నిరసనకు బీఆర్ఎస్ పిలుపు