నల్లగొండ : నాలుగు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభలు ఆందోళనలు, పరస్పర దాడులతో మూడో రోజు ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తాజాగా నల్లగొండ (Nallagonda) జిల్లాలో ఓ యువకుడు నిరసన దీక్ష(Youth protest) చేపట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు అర్హత ఉన్న పేదలకు కాకుండా అనర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చాయని ఆరోపించారు.
మళ్లీ సర్వే నిర్వహించి పేదలకు న్యాయం చేయాలని గ్రామ పంచాయతీ వద్ద నిరసన దీక్ష చేట్టారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు పంపిణీలో పారదర్శకత పాటించకపోతే ఆందోళన ఉధృతం చేస్తానని హెచ్చరించాడు.
ఇవి కూడా చదవండి..
KTR | ఐటీ ఇండస్ట్రీలో ఉండాలంటే నిజమైన ప్రతిభ.. అంకితభావం అవసరం.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్