Abdullahpurmet | తాను ప్రేమిస్తున్న యువతితో చనువుగా ఉంటున్నాడని ఓ యువకుడు తన స్నేహితుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా (rangareddy District) అబ్దుల్లాపూర్ మెట్ (Abdullahpurmet) పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
హరి, నవీన్
నాగర్ కర్నూల్ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నవీన్ (22) నల్గొండ (Nalgonda)లోని ఎంజీ యూనివర్సిటీ (Mahatma Gandhi University) పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న హరి, నవీన్ మంచి మిత్రులు. అయితే, వీరిద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఈ విషయమై ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నవీన్‌ను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని భావించిన హరి.. ఈనెల 17న ఉదయం పార్టీ చేసుకుందామని హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని తన స్నేహితుడి రూమ్‌కు నవీన్‌ను రమ్మన్నాడు. పార్టీలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ విషయాన్ని నవీన్.. తన తండ్రి శంకరయ్యకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. దీంతో శంకరయ్య హరితో మాట్లాడటంతో గొడవ సద్దుమణిగింది.
ఆ తర్వాత నుంచి నవీన్ కనిపించకుండా పోయాడు. దీంతో నవీన్ తండ్రి శంకరయ్య ఈనెల 22న నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎంజీయూలో విద్యార్థులు, హరి స్నేహితులను విచారించారు. ఈ నెల 22న సాయంత్రం నుంచి హరి ఫోన్ స్విఛ్చాఫ్ రావడంతో వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు అతని గురించి ఆరా తీశారు. దీంతో హరి శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. తన ప్రియురాలిని నవీన్ ఎక్కడ దక్కించుకుంటాడో అన్న అసూయతోనే విచక్షణారహితంగా కొట్టి హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో పడేసిన నవీన్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read..
College Principal | ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి.. చికిత్స పొందుతూ మృతి
Anand Mahindra | ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రహదారి..! ఆసక్తికర వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
Rashmi Gautam | రష్మిని కుక్కతో పోల్చిన నెటిజన్.. ఓపెన్ ఛాలెంజ్ విసిరిన యాంకర్..!
Joe Biden-Vladimir Putin | బైడెన్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన పుతిన్..!