College Principal | ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి.. చికిత్స పొందుతూ మృతి
Madhya Pradesh | మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని బీఎం ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్‌పై ఓ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. 80 శాతం కాలిన గాయాలతో ప్రిన్సిపాల్ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు.
College Principal | భోపాల్ : మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని బీఎం ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్‌పై ఓ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. 80 శాతం కాలిన గాయాలతో ప్రిన్సిపాల్ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు.
ఏం జరిగిందంటే..?
అశ్‌తోష్ శ్రీవాస్తవ(24) అనే విద్యార్థి బీఎం ఫార్మసీ కాలేజీలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అయితే మార్క్ షీట్ ఇవ్వడంలో కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని శ్రీవాస్తవ ఆరోపించాడు. ఫిబ్రవరి 20వ తేదీన కాలేజీకి వెళ్లి తన మార్క్స్ మెమో ఇవ్వాలని ప్రిన్సిపాల్ విముక్త శర్మ(54)ను అశ్‌తోష్ అడిగాడు. సెవెంత్ సెమిస్టర్ ఫెయిలైన కారణంగా మెమో ఇవ్వడం కుదరదని ప్రిన్సిపాల్ తేల్చిచెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన శ్రీవాస్తవ.. ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి సిగరెట్ లైటర్‌తో నిప్పంటించాడు. 80 శాత కాలిన గాయాలతో ఆమె ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని అదే రోజు పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

