Anand Mahindra | అత్యవసర సమయాల్లో ‘ట్రాఫిక్’ (traffic) చిరాకు తెప్పించే అంశం. ప్రధాన నగరాల్లో అయితే చెప్పనక్కర్లేదు. మనం గమ్యస్థానానికి చేరుకోవాలంటే ఇంటి దగ్గర ఒక్కోసారి గంట లేదా రెండు గంటల ముందే బయలు దేరాల్సి వస్తుంది. సగం టైమ్ మొత్తం ట్రాఫిక్ (traffic)లోనే పోతుంది. రద్దీనే అనుకుంటే మధ్యమధ్యలో వచ్చే ట్రాఫిక్ సిగ్నల్స్ (traffic signals) సహనాన్ని పరీక్షిస్తుంటాయి. అదే ‘ట్రాఫిక్ సిగ్నల్స్’ (without traffic signals) లేని రహదారి (Road) ఉంటే..? ఊహించుకుంటేనే గాల్లో తేలినట్టుంది కదూ.
అలా ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఓ అద్భుతమైన రోడ్డు డిజైన్‌కు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) నెటిజన్లకు పరిచయం చేశారు. వీడియోలో వాహనాలు ఎక్కడా ఆగకుండా తమ దారిలో అవి వెళ్తూ కనిపించాయి. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘అద్భుతం. యెమెన్ ఇంజనీర్ ముహమ్మద్ ఆవాస్ (Yemeni engineer Muhammad Awas ) (2016లో అభివృద్ధి చేయబడింది) రూపొందించిన డిజైన్. ఇది ‘హాఫ్ రౌండ్-అబౌట్స్’ (half round-abouts)లను ఉపయోగించి ట్రాఫిక్ లైట్లు లేకుండా ట్రాఫిక్‌ను నిరంతరం నియంత్రిస్తుంది’ అంటూ రాసుకొచ్చారు. ఇదే సందర్భంలో ‘ఈ విధానంలో ఎక్కువ ఇంధన వినియోగం ఉంటుందా?’ అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Fascinating. A design by a Yemeni engineer Muhammad Awas (developed in 2016) which continuously regulates traffic without traffic lights using ‘half round-abouts'. But does it involve a higher use of fuel?
[source: https://t.co/iBIxKgbDzs] pic.twitter.com/83UV1vjmTb
— anand mahindra (@anandmahindra) February 23, 2023
Also Read..
Rashmi Gautam | రష్మిని కుక్కతో పోల్చిన నెటిజన్.. ఓపెన్ ఛాలెంజ్ విసిరిన యాంకర్..!
Joe Biden-Vladimir Putin | బైడెన్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన పుతిన్..!
SS Rajamouli | ‘ఆర్ఆర్ఆర్’ చేతికి మరో అవార్డు.. విశ్వవేదికపై రాజమౌళి స్పీచ్..!
PV Sindhu | కోచ్ పార్క్‌కు సింధు గుడ్‌బై.. కొత్త కోచ్ వేటలో స్టార్ షట్లర్..!