విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ, పాత్రలపరంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది వరలక్ష్మి శరత్‌కుమార్. ఆమె ఇప్పుడు దర్శకురాలిగా సరికొత్త బాధ్యతను తీసుకుంది. స్వీయ దర్శకత్వంలో తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి న్యూఏజ్ థ్రిల్లర్ ‘సరస్వతి’లో నటిస్తున్నది. ఈ సినిమాకు నిర్మాతలు కూడా వారిద్దరే కావడం విశేషం.
షూటింగ్ పూర్తయిన సందర్భంగా వరలక్ష్మి శరత్‌కుమార్ సోషల్‌మీడియా ద్వారా ఓ ఫొటోను పంచుకుంది. హై కాన్సెప్ట్ థ్రిల్లర్ చిత్రమిదని, ఇన్నోవేటివ్ పాయింట్‌తో ఆకట్టుకుంటుందని చెప్పింది. జీవా, ప్రకాష్‌రాజ్, నాజర్, ప్రియమణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, దర్శకత్వం: వరలక్ష్మి శరత్‌కుమార్.