శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. సాక్షి వైద్య కథానాయిక. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం మ్యూజికల్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది.
మంగళవారం ‘భల్లే భల్లే’ అనే గీతాన్ని విడుదల చేశారు. కేరళ పచ్చని ప్రకృతి అందాల నడుమ ఈ ప్రేమగీతం ఆకట్టుకునేలా సాగింది. ప్రతీ ఫ్రేమ్ కలర్ఫుల్గా పండగ వాతావరణాన్ని తలపించింది. ప్రేమలోని మధుర భావాల్ని ఆవిష్కరించే గీతమిదని, నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.