PV Sindhu | కోచ్ పార్క్‌కు సింధు గుడ్‌బై.. కొత్త కోచ్ వేటలో స్టార్ షట్లర్..!
PV Sindhu | భారత స్టార్ షట్లర్ ( Indian Star Shuttler ) పీవీ సింధు (PV Sindhu) తన వ్యక్తిగత కోచ్, దక్షిణ కొరియాకు చెందిన (South Korean coach) పార్క్ టి సాంగ్ (Park Tae Sang ) సేవలకు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం ఆమె కొత్త కోచ్‌ను వెతుక్కునే పనిలో పడింది.
PV Sindhu | భారత స్టార్ షట్లర్ ( Indian Star Shuttler ) పీవీ సింధు (PV Sindhu) తన వ్యక్తిగత కోచ్, దక్షిణ కొరియాకు చెందిన (South Korean coach) పార్క్ టి సాంగ్ (Park Tae Sang ) సేవలకు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం ఆమె కొత్త కోచ్‌ను వెతుక్కునే పనిలో పడింది. ఈ విషయాన్ని పార్క్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ‘పీవీ సింధు (PV Sindhu)తో నా అనుబంధం గురించి చాలా మంది అడుగుతున్నారు. ఇటీవల ఆడిన మ్యాచుల్లో సింధు నిరాశపరిచింది (disappointing moves). కోచ్‌గా అందుకు నేను బాధ్యత వహిస్తున్నా. తను మార్పు కోరుకుంటోంది. కొత్త కోచ్‌ను వెతుక్కుంటానని చెప్పింది. దీంతో తన నిర్ణయాన్ని గౌరవిస్తూ.. కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. వచ్చే ఒలింపిక్స్ వరకు సింధుతో ఉండలేకపోతున్నందుకు క్షమించండి. దూరం నుంచి ఆమెకు మద్దతు తెలుపుతా’ అని పార్క్ పేర్కొన్నారు.
పార్క్ (Park)-సింధు (Sindhu) కలిసి 2019 నుంచి కలిసి పనిచేస్తున్నారు. పార్క్ కోచింగ్‌లో సింధు పలు విజయాలు సాధించింది. మూడు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ (BWF World Tour) టైటిళ్లు, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ (Syed Modi International Badminton Championships), స్విస్ ఓపెన్ (Swiss Open), సింగపూర్ ఓపెన్లను (Singapore Badminton Open) గెలుచుకుంది.
అలాగే, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో (Commonwealth Games) స్వర్ణ పతకం (Gold Medal), 2020 టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics) కాంస్య పతకం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత ఎడమకాలి గాయం కారణంగా సింధు దాదాపు ఐదు నెలల విరామం తీసుకుంది. ఆ తర్వాత మలేషియా ఓపెన్‌తోపాటు పలు టోర్నీలు ఆడిన సింధు.. తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. దీంతో ఇటీవల సింధు నిరాశజనక ప్రదర్శనకు తానే బాధ్యత అంటూ పార్క్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
Also Read..
PSL: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో దంచికొట్టిన మొయిన్ ఖాన్ కుమారుడు.. వీడియో
RRR wins HCA Awards | ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో 4 అంతర్జాతీయ అవార్డులు
Iran Cruise Missile: క్రూయిజ్ మిస్సైల్‌తో ట్రంప్‌ను చంపేస్తాం: ఇరాన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

