RRR wins HCA Awards | ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో 4 అంతర్జాతీయ అవార్డులు
RRR wins HCA Awards | రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డుల పంట కురిపిస్తుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాను ఇప్పుడు మరో 4 అంతర్జాతీయ అవార్డులు వరించాయి.
RRR wins HCA Awards | రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డుల పంట కురిపిస్తుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాను ఇప్పుడు మరో 4 అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నాలుగు కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డులు గెలుచుకుంది. ఒకేసారి 4 అవార్డులు అందుకున్న తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది.
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం, బెస్ట్ యాక్షన్ ఫిలిం, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ స్టంట్స్ కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. రాజమౌళి, కీరవాణి, రామ్‌చరణ్ ఈ అవార్డులను అందుకున్నారు. కాగా బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లోనూ ఆర్ఆర్ఆర్ సినిమా హెచ్‌సీఏ అవార్డుల కోసం నామినేట్ అయ్యింది. కానీ వాటిలో నిరాశే ఎదురైంది. ఈ రెండు కేటగిరీల్లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ది వన్స్ సినిమా అవార్డులు గెలుచుకోవడం గమనార్హం.
నాటు నాటు క్రేజ్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి జనాల మన్నన పొందుతూనే ఉంది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ కోసం తారక్, చెర్రీ వేసిన స్టెప్పులు భారతీయులతో పాటు విదేశీయులను కూడా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ పాటకు పలు అవార్డులు వరించాయి. ముందుగా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది. అదే ఊపుతో ఆస్కార్ కోసం ఫైనల్ నామినేషన్స్‌కు ఎంపికైంది. త్వరలో ఈ సాంగ్‌కు ఆస్కార్ వస్తుందని ఎదురుచూస్తున్న తరుణంలో హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవార్డు కూడా రావడం ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

