ఆదిలాబాద్ : కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డల బాధలకు అంతేలేకుండా పోయింది. గుక్కెడు నీళ్ల కోసం మైళ్లదూరం వెళ్లాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. తాగు నీటి కోసం మహిళలు ఉద్యమబాట(Women protest) పట్టారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కే.ఆర్.కే కాలనీలో నీళ్లు రావడం లేదని ఆరోపిస్తూ ఖాళీ బిందెలతో కలెక్టర్ ఇంటి(Collector house) ముందు నిరసన తెలిపారు. గతంలో ఆందోళన చేస్తే కేవలం రెండు రోజులే నీళ్లు వదిలారని, తమ సమస్యను త్వరగా పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. వెంటనే అధికారులు కాలనీకి నీటి సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?