నిర్మల్ : నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా ధర్మార గ్రామానికి చెందిన జయ(45) అనే మహిళ బాసర(Basara) గోదావరి(Godavari river) మొదటి ఘాట్ వద్ద స్నానానికి వెళ్లి నీటిలో మునిగి మృతి(Woman died) చెందింది. మృతురాలు జయకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కాగా, జయ భర్త సంవత్సరం క్రితం మృతి చెందాడు, అత్త మూడు నెలల క్రితం మృతి చెందింది.
ఒకే సంవత్సరంలో కుటుంబంలోని ముగ్గురు సభ్యులు మృతి చెందంటంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇదే సమయంలో మరో మహిళ నీటిలో మునిగిపోతుండగా గమనించిన ఓ భక్తుడు సదరు మహిళను కాపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
KTR | మూసి నది సాక్షిగా.. మహానగరంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇదిగో.. : కేటీఆర్
HYDRAA | మూసీలో ఎర్రగీత.. విషమిచ్చి చంపి ఇండ్లు కూల్చండి