తాడ్వాయి, మే27 : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం రహదారిలో మంగళవారం అడవి దున్నలు సంచరించాయి. ఉదయం ఏడు గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మల దర్శనానికి వెళ్తున్న భక్తులు మేడారం సమీపంలోని శివరాంసాగర్ చెరువు సమీపంలోకి రాగానే మూడు దున్నలు రోడ్డు దాటుతూ కనిపించగా భక్తులు అవి వెళ్లే వరకు వేచి ఉన్నారు. అయితే గ్రామానికి ఇంత దగ్గరగా అడవి దున్నలు సంచరిస్తూ కనబడడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అడవి దున్నలను చూసినందుకు సంతోషపడ్డారు. అడవి దున్నలు రోడ్డు దాటుతున్న ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 625 పాయింట్లు డౌన్..!
Raveena Tandon | అతడి పెదవులు తగలగానే వాంతులు చేసుకున్నా: రవీనా టాండన్
Panchkula | హర్యానాలో విషాదం.. కారులో విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి