బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 18:36:06

భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

నల్గొండ : డిండి ఎత్తి పోతల పథకంలో భాగంగా నాంపల్లి మండలం లక్ష్మణపురం వద్ద నిర్మితమవుతున్న కిష్టరాయిన్‌పల్లి జలాశయంతో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ కోసం కృషి చేస్తున్నాం.  జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కిష్టరాయిన్ పల్లి జలాశయనిర్మాణం కారణంగా భూములు, ఇండ్లు కోల్పోయిన నాంపల్లి మండలం లక్ష్మణపురం నిర్వాసితులు మునుగోడు ఎమ్మెల్యే కె.రాజగోపాల్ రెడ్డితో కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పరిహారం విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నారు. అందరికి త్వరలోనే న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.logo