హైదరాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు జలాశయాల్లో నీటినిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. అప్పర్ మానేరులో 2 టీఎంసీలకు గాను 0.661 టీఎంసీలు, మిడ్ మానేరులో 27.5 టీఎంసీలకు గాను 7.4 టీఎంసీలు, లోయర్ మానేరులో 24 టీఎంసీలకు గాను 6 టీఎంసీల నీరు మాత్రమే ఉండడంతో పంటలు సాగు చేసేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే సూచనలు కనిపిస్తుండటంతో సాగునీరు, తాగునీటి నీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
RCB | అతడు మరో నాలుగేండ్లు ఆడుతాడు.. తేల్చి చెప్పిన ఆర్సీబీ సీఈవో రాజేష్ మీనన్