RCB | అతడు మరో నాలుగేండ్లు ఆడుతాడు.. తేల్చి చెప్పిన ఆర్సీబీ సీఈవో రాజేష్ మీనన్
RCB | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ(Virat Kohli), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుది(RCB) విడదీయరాని బంధం.
RCB | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ(Virat Kohli), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుది(RCB) విడదీయరాని బంధం. 2008 లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఒకే ఫ్రాంచైజీ తరఫున 19 సీజన్లలో ఆడిన ఏకైక ఆటగాడిగా ఈ బ్యాటింగ్ దిగ్గజం నిలిచాడు. తాను జట్లు మారే ప్రణాళికలు లేవని, తన ఐపీఎల్ కెరీర్‌ను ఆర్సీబీతోనే ముగించాలనుకుంటున్నానని కోహ్లీ పలు సందర్భాల్లో స్పష్టం చేశాడు. ఆర్సీబీ అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను నిజం చేస్తూ వరుసగా గత రెండు సీజన్లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ఆర్సీబీ తమ టైటిల్ కరువును తీర్చుకుంది.
ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్(IPL) భవిష్యత్తుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీఈఓ రాజేశ్ మీనన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ మరో 3 నుంచి 4 ఏళ్ల పాటు ఐపీఎల్లో ఆర్సీబీ తరఫునే ఆడతారని ఆయన స్పష్టం చేశారు. రిటైర్మెంట్ తర్వాత కూడా కోహ్లీ ఫ్రాంచైజీతో కొనసాగుతారని పేర్కొన్నారు. అతను పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఆట పట్ల అతనికి ఉండే తపన ఏమాత్రం తగ్గలేదు. ఈ ఐపీఎల్ సీజన్లో అతనిలో కనిపించిన ఉత్సాహం చూస్తుంటే మరికొంత కాలం ఆడేందుకు ఎలాంటి సమస్యా ఉండదని ఆయన స్పష్టం చేశారు. అనుభవజ్ఞుడైన విరాట్ లాంటి బ్యాటర్ జట్టుకు ఎంతో ఉపయోగకరమన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

