Unemployee | 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనిచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. ఆ హామీని అమలు చేయకుండా మోసం చేయడంపై నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై అభ్యంతరం తెలుపుతూ రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టిందని తెలిసిందే.
తాజాగా వరంగల్‌కు చెందిన రాకేశ్ అనే నిరుద్యోగి రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డాడు. రాకేశ్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఉన్నయి అని చెప్పిండో.. ఆ ఖాళీలను పారదర్శకంగా నువ్వు చెప్పినవే భర్తీ చేయాలని అడుగుతున్నం తప్ప కొత్తగా మా కోసం ఉద్యోగాలు క్రియేట్ చేయకు. మమ్మల్ని ఎండ్రిన్ తాగమననీకి రేవంత్ రెడ్డి ఎవరు..? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే బాధ్యత, పద్దతి అదేనా..? మా కోసం ఆయన ఇంట్ల నుంచి ఏం డబ్బులు పంపిస్తలేడు కదా..లేకపోతే గవర్నమెంట్ నుంచి మాకేం డబ్బులు వస్తలేవు కదా..మా తల్లిదండ్రులు కష్టపడి మాకు డబ్బులు పంపిస్తే స్టడీ హాళ్లలో, హాస్టళ్లలో ఉండి మేం చదువుకుంటున్నం తప్ప ఆయన ఇంట్ల నుంచేం డబ్బులు ఇస్తలేడుకదా.. ఆయననే ఎండ్రిన్ తాగి సావాలి.. మమ్మల్ని ఎందుకు చావుర్రి అంటుండని ధ్వజమెత్తాడు.
కేసీఆర్ వందకు వందశాతం బెటర్.. ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ అయినా ఎక్కువ పోస్టులతో ఇచ్చిండు. నువ్వు నోటిఫికేషన్ ఇయ్యకపోయినా ఫర్వాలేదు.. ఇంకో 5 నెలలు ఆలస్యమైనా ఫర్వాలేదు.. కానీ నోటిఫికేషన్లో నువ్వు ఎక్కువ పోస్టులు ఇవ్వకపోతే ఏం లాభం. 5 వేల పోస్టులు ఎవరి కోసమని ప్రశ్నించాడు. 70 వేలు, రెండు లక్షల ఉద్యోగాలు అంటున్నవ్..నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. కానీ అబద్దాలు ఆడటం బంద్ చేసుకో అని హితవు పలికాడు. పక్క ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మేమిచ్చినం లక్ష ఉద్యోగాలు అని చెప్తున్నడు. ఈయన కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిండు. వాళ్లకు నోటిఫికేషన్ ఇయ్యలేదు.. ట్రైనింగ్ ఇప్పించలేదు. ఏం చేయలేదు. కేవలం ఎల్బీ స్టేడియంలోకి వాళ్లను తీసుకొచ్చి నియామక పత్రాలు ఇచ్చిండన్నాడు.
మాకోసం కొత్త ఉద్యోగాలు ఇవ్వమని మేము అడగడం లేదు.. కాలిగా ఉన్నవే ఫిల్ చేయండి అంటున్నాము
మమ్మల్ని ఎండ్రిన్ తాగమనడానికి ఆయన ఎవరు అసలు
మా చదువులకు, మా ఖర్చులకు ఆయన ఏమీ డబ్బులు పంపడం లేదు కదా
అవసరం అయితే ఆయననే ఎండ్రిన్ తాగి చావ మానండి.. మమ్మల్ని అనొద్దని చెప్పండి
రేవంత్ రెడ్డి… https://t.co/fvg1QY0pHI pic.twitter.com/lNRn3u912i
— Telugu Scribe (@TeluguScribe) July 16, 2026