ఉషారున్నోడికి ఇషారా చాలు!
మన తెలంగాణల ’హైడ్రా’ చుట్టూ జరుగుతున్న వివాదం చూస్తుంటే అచ్చం ’దున్నపోతు మీద వాన పడ్డట్టే’ ఉన్నది. సామీ.. హైకోర్టు ఏమన్నా చిన్న మాట అన్నదా? ’రాష్ట్ర వ్యవస్థల మీద మాకు నమ్మకం పోయింది.. వివాదాస్పద స్థలాల దగ్గరకు హైడ్రాను పోనియ్యకుండా ఆర్మీని కాపలా పెడుతాం అని అంత స్పష్టంగా చెప్పినప్పుడే, మన ప్రభుత్వానికి బుద్ధొచ్చి అప్రమత్తం కావాల్సింది.
మన తెలంగాణల ’హైడ్రా’ చుట్టూ జరుగుతున్న వివాదం చూస్తుంటే అచ్చం ’దున్నపోతు మీద వాన పడ్డట్టే’ ఉన్నది. సామీ.. హైకోర్టు ఏమన్నా చిన్న మాట అన్నదా? ’రాష్ట్ర వ్యవస్థల మీద మాకు నమ్మకం పోయింది.. వివాదాస్పద స్థలాల దగ్గరకు హైడ్రాను పోనియ్యకుండా ఆర్మీని కాపలా పెడుతాం అని అంత స్పష్టంగా చెప్పినప్పుడే, మన ప్రభుత్వానికి బుద్ధొచ్చి అప్రమత్తం కావాల్సింది. కానీ, ఆ ‘ఇషారా’ను అర్థం చేసుకోకుండా అట్లనే నెట్టుకొచ్చేవరకు.. ఆ హైడ్రా కమిషనర్‌ను వెంటనే పదవి నుంచి తొలగించి, ఇంకో పెద్ద అధికారికి బాధ్యతలు ఇయ్యుండ్రి’ అని సీఎస్‌కు హైకోర్టు ఆర్డర్ వేసే వరకు తెచ్చుకున్నరు!
ఇక్కడ ఇచ్ఛంత్రం ఏందంటే.. మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీ పర్యటనల్లో కూడా ’హైడ్రా అనేది మేం తెచ్చిన గొప్ప సంస్కరణ.. దేశానికే రోల్ మాడల్’ అని డప్పు కొట్టుకుంటున్నరు. కానీ ఇటు చూస్తే సీన్ రివర్స్! ’అయ్యా! గీ హైడ్రాతో మాకు, మా శాఖకు అసలు సంబంధమే లేదు.. గదంతా సీఎం సారుదే, ఆయన నిర్ణయమే!’ అని ముఖం మీదనే మరోమంత్రి తేల్చిచెప్పిండు. ’పిల్లవాని బాధ్యత నాది అని తండ్రి అంటే.. ఆ పిల్లాడెవడో తెల్వదని తల్లి తప్పించుకున్నట్టు’ ఉన్నది ఈ కాంగ్రెస్ మంత్రుల ’సమన్వయ’ పాలన! న్యాయ నిపుణులు అందుకే నవ్వుకుంటూ ఏమంటున్నారంటే.. ’ఉషారున్నోడికి చిన్న ఇషారా ఇస్తే చాలు.. కానీ ఇక్కడ పాలకులకు ఆర్మీ కాప లా పెడతామన్నా బుద్ధి రాలేదు, అరవైకి పైగా ధిక్కరణ కేసులు పడినా బుల్డోజర్ పట్టుకుని కూర్చున్నారు’ అని ఘాటుగా విమర్శిస్తున్నారు.
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

