కుత్బుల్లాపూర్, ఆగస్టు1 : జీడిమెట్ల సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో కొంపల్లి నుంచి సుచిత్ర వైపునకు వచ్చే మార్గంలో ఫుట్‌పాత్‌పై ఉన్న చిరువ్యాపారాలను తొలగించడం ఉద్రిక్తతతకు దారితీసింది.
నిరుపేద వ్యాపారులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేయడం వాగ్వాదానికి దారితీసింది. చిరువ్యాపారాలపై ప్రతాపం చూపిస్తున్న అధికారులు..పెద్ద పెద్ద అక్రమ వ్యాపార సముదాయాలపై చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ప్రశ్నించారు. తమకు జీవనోపాధి లేకుండా చేశారన్నారు.