ఈటల రాజేందర్ పదేపదే ఆత్మగౌవరం అంటున్నారు. ఆయన ఆత్మగౌరవం హుజూరాబాద్ ప్రజలకు సంబంధించింది కాదు. ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే హుజూరాబాద్ ప్రజలను మభ్య పెడుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటల ఏం చేయలేదు. కేసీఆర్ చేసిన పనులు వంద చెప్పగల్గుతాం. ఇప్పుడు ఈటల గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. సానుభూతి కోసమే ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఆయనకు ఎలాంటి ఆత్మగౌరవం లేదు. హుజూరాబాద్ అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదు. ఏడు సంవత్సరాలు మినిస్టర్‌గా చేసినా కానీ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. – గొట్టం శ్యాంసుందర్ రెడ్డి ( హుజూరాబాద్ మండలం, కనుకులగిద్ద గ్రామం )
మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధి.. ఇప్పుడే ఓటేస్తే మీరు ఏం అభివృద్ధి చేస్తరు? మీరు చెప్పండి.. మీకు పుణ్యముంటది కొంచెం. రైతుగా తమ మద్దతు టీఆర్ఎస్ గవర్నెమంట్కే ఉంటుంది. కేసీఆర్‌కే మా ఓటు. – రాఘవేందర్ రెడ్డి ( హుజూరాబాద్ మండలం, కండ్లకుంట గ్రామం )