KTR | సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని కలిసింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్ నుంచి మాజీ మంత్రి జోగురామన్న, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతోపాటు సీసీఐ సాధాన సమితి సభ్యులను అందరినీ తీసుకొని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామిని కలిశాం. 1980వ దశకంలో ఏర్పాటు చేయబడ్డ సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ఒకదశలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని అన్నారు. రాబోయే 100 సంవత్సరాల వరకు మీకు మైన్ స్టోన్ రిజర్వ్‌లు కూడా మీకు ఉన్నాయి. 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఉన్న ఈ ప్లాంట్‌ను నడిపేందుకు అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయన్నారు.
గతంలో 2019లో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా మాటిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ప్లాంట్‌ను తప్పకుండా తెరిపిస్తామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెప్పారు. ప్లాంట్‌ను తెరిపిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం కూడా మాటిచ్చారు. కానీ ఈ రోజు ఆదిలాబాద్ సీసీఐని తుక్కు కింద అమ్మేస్తున్నరని వారికి వివరంగా చెప్పడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ లీజ్ పొడిగించాలి..
సీసీఐ సాధన సమితి చేస్తున్న పోరాటం అభినందనీయం. మేం కూడా దీన్ని మళ్లీ నడపాలని కోరికతోనే ఉన్నామని కేంద్రమంత్రి అన్నారని కేటీఆర్ వెల్లడించారు. దాదాపు 230 ఎకరాలు అక్కడ ల్యాండ్ ఉన్నది. ఒక 770 ఎకరాలు ప్రైవేట్ పట్టా ల్యాండ్ కంపెనీకి ఉంది. అట్లాగే 1500పై చిలుకు ఎకరాలు లీజ్ ల్యాండ్ ఉంది. మరి 2 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీతో పెడితే బాగుంటదన్నారు. ఏమైంది ఎందుకు తెరవలేకపోతున్నరని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం కొంత స్పందించడం లేదు.. సంవత్సర కాలంగా మేం ప్రయత్నం చేస్తున్నం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ లీజ్ పొడిగించాలి. వాళ్లు ముందుకు రావడం లేదు. మరి రాష్ట ప్రభుత్వం ఏం సబ్సిడీ ఇస్తదా.. ఏమన్నా పెట్టుబడి పెడ్తతా..? జీఎస్టీ మినహాయింపు ఇస్తదా… చెప్పమంటే చెప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది నుంచి పెద్దగా స్పందించడం లేదని కేంద్రమంత్రి చెప్పారని కేటీఆర్ వివరించారు.
సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రికి సీసీఐ సాధన సమితి తరపున ధన్యవాదాలుతెలియజేస్తూ.. మేం అధికారంలో ఉన్నప్పుడు సిర్పూర్ పేపర్ మిల్లు తెరిపించాం. అదే ఆదిలాబాద్జిల్లాలో మళ్లీ వెంబడ పడి తిరిగి తెరిపించి ఇవాళ వేలాది మందికిఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే వారు ముందుకొచ్చిమైనింగ్ లీజ్‌ను ఎక్స్టెండ్ చేయాలి. రూ.2 వేల కోట్ల పెట్టుబడి అంటే రాష్ట్రప్రభుత్వం తరుపున మీరేం ప్యాకేజీ ఇస్తారో చెప్పాలన్నారు. సీసీఐని పునరుద్దరిస్తామని ఎన్నికల ప్రచారంలో అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్రమంత్రి చెప్పారు. సీసీఐని పునరుద్దరిస్తే వేలాదిమందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
When BRS was in power in Telangana, many sick industries were revived.
The Cement Corporation of India (CCI), which was established in the 1980s, employed nearly 6,000 people at its peak.
Unfortunately, despite the best efforts of the then BRS government, the NDA government did… pic.twitter.com/pVkUMDcdcj— BRS Party (@BRSparty) July 15, 2026