మహబూబాబాద్ : మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కురవి మండలం అయ్యగారిపల్లి వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఆగివున్న టిప్పర్ను వెనుక నుంచి బైక్ ఢీ కొట్టడంతో(Bike accident) ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన జాతీయ రహదారిపై రాత్రి తెల్లవారు జామున సుమారు 1.30 గంటల ప్రాంతంలో జరిగింది.
మృతులను సూధనపల్లి గ్రామానికి చెందిన వల్లపు కుమార్ స్వామి(18) వెంపటి విశాల్(22)గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
AR Rahman | రెహమాన్ – సైరా భాను విడాకుల విషయంలో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు : లాయర్
Bhairavam | భైరవం షూటింగ్ టైం.. కోనసీమలో అదితీశంకర్తో బెల్లంకొండ శ్రీనివాస్
Nayanthara | నయనతార డాక్యుమెంటరీకి నెట్ఫ్లిక్స్ అన్ని కోట్లు చెల్లించిందా..?