మహబూబ్‌నగర్ : దొంగతనానికి వచ్చి కరెంట్ షాక్ కొట్టి(Electric shock) ఇద్దరు దొంగలు మృతి(Thieves died) చెందారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా(Mahbubnagar) మిడ్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రగతి సోలార్ ప్లాంట్‌లో(Solar plant) తరచూ కేబుల్ దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో వాటిని అరికట్టేందుకు దాని యజమానులు రెండు విద్యుత్ షాక్ కంచెలు ఏర్పాటు చేశారు.
అయితే దొంగలు మొదటి కంచె కట్ చేసి రెండో కంచె కట్ చేసే క్రమంలో కరంట్ షాక్ కొట్టి అక్కడిక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు.. కమలా హారిస్‌పై కేటీఆర్ ట్వీట్
Harish Rao | జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైంది : హరీశ్‌రావు
KTR | కాంగ్రెస్ పాలనలో మరో కుంభకోణం జరుగుతున్నట్లు అనిపిస్తోంది : కేటీఆర్