Kamala Harris | అధ్యక్ష ఎన్నికలతో అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. డెమోక్రాట్స్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ (Kamala Harris) మొదటిసారి ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. ట్రంప్‌తో జరిగిన ఈ డిబేట్లో కమలా దూకుడు ప్రదర్శించారు. ట్రంప్ విధానాలను ఎండగట్టారు.
ఈ చర్చలో ట్రంప్‌పై కమలా చేసిన ఎదురుదాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశంసించారు. కమలా హారిస్ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి అంటూ కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘కమలా హారిస్ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి అనిపించింది.. ఈ ఏడాది చివర్లో అమెరికాకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి’ అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ వైరల్‌గా మారింది.
She looked truly “Presidential”@KamalaHarris ✌️
United States might just have their First ever Woman President later this year #PresidentialDebate2024
— KTR (@KTRBRS) September 11, 2024
కాగా, నవంబర్ 5న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమాక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక భారత మూలాలున్న అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris) ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు గట్టి పోటీ ఇస్తున్నారు.
ఈ క్రమంలో ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల మధ్య ఇవాళ తొలి డిబేట్ జరిగింది. ఏబీసీ న్యూస్ నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు. ఆ ఇద్దరూ అనేక అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అబార్షన్లు, యుద్ధాలు, ఆర్థికం, హౌజింగ్ సంక్షోభం లాంటి అంశాలపై చర్చించుకున్నారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్.. పోటాపోటీగా డిబేట్లో పాల్గొన్నారు. తొలుత ఇద్దరూ చర్చావేదికపై హ్యాండ్‌షేక్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత తమ విధానాలను వివరించారు.
Also Read..
Killer wolfs | యూపీలో మరోసారి తోడేలు దాడి.. 11 ఏళ్ల బాలికకు గాయాలు
KTR | కాంగ్రెస్ పాలనలో మరో కుంభకోణం జరుగుతున్నట్లు అనిపిస్తోంది : కేటీఆర్