ఆదిలాబాద్ : ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి(Consuming pesticide) ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన తలమడుగు మండలం ఉండం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రాకేశ్, ఆయన భార్య లావణ్య, కూతురు ప్రశంస, మేనకోడలు స్పందన వారి చేనుకు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ, రాకేశ్, ఆయన మేన కోడలు పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. వారిద్దరూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సీఐ ఫణీందర్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..