NTR Neel | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది దేవర సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం కన్నడ స్టార్ దర్శకుడు కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ (PrashanthNeel)తో తారక్ సినిమా చేయబోతున్నాడు. #NTRNeel గా రానున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందా ఎప్పుడు అప్డేట్లు వస్తాయా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ ఈ నెలలోనే పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఈ మేజర్ షెడ్యూల్లో ఎన్టీఆర్‌తో పాటు పలువురు అగ్ర తారాలు షూటింగ్లో పాల్గోనబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తారక్ వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ అనంతరం నీల్ ప్రాజెక్ట్ మీదా ఫోకస్ చేయనున్నాడు తారక్.