TREI-RB | హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు ఈనెల 27, 28, 30 తేదీల్లో డెమో నిర్వహించనున్నట్లు ట్రిబ్ చైర్మన్ బడుగు సైదులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాసాబ్‌ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్లో ప్రతి రోజు రెండు సెషన్స్‌లో అభ్యర్థులకు డెమో నిర్వహిస్తామన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యిన అభ్యర్థులు https://treirb.cgg.gov.in వెబ్సైట్లో షెడ్యూల్ చెక్ చేసుకుని ఆయా తేదీల్లో డెమోకు హాజరు కావాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
Minister Seethakka | మంత్రి సీతక్క ఇలాకాలో.. మద్యం మత్తులో ఉపాధ్యాయుడి హల్చల్.. వీడియో
Gadwal | ఆ ప్రిన్సిపాల్ మాకొద్దంటూ.. 18 కి.మీ. పాదయాత్ర చేసిన విద్యార్థులు
MLC Kavitha | 42 శాతం రిజర్వేషన్లను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోం : ఎమ్మెల్సీ కవిత