MLC Kavitha | 42 శాతం రిజర్వేషన్లను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోం : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, హామీల అమలు కోసం పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
MLC Kavitha | హైదరాబాద్ : కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, హామీల అమలు కోసం పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
మంగళవారం నాడు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు, విశ్వకర్మ కుల సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. తమకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… బీసీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను కుదేలు చేస్తున్నదని విమర్శించారు. కుల వృత్తుల వారికి ప్రభుత్వం కనీస మద్ధతు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధికంగా బీసీ విద్యార్థులు లబ్ది పొందే ఫీజు రియింబర్స్మెంట్, పూలే స్కాలర్ షిప్ పథకాల నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. బీసీలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐక్యతను చాటి హామీల అమలుకు ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బీసీల కోసం అనేక విప్లవాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని, ఇప్పుడు వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటి వరకు బీసీ సంక్షేమానికి ఎంత ఖర్చు చేశారని చెప్పాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో యునైటెడ్ ఫులే ఫ్రంట్ నాయకులు బొల్లా శివ శంకర్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు కొట్టాల యాదగిరి ముదిరాజ్, దాసరి నరేష్ ముదిరాజ్, నాగభూషణం ముదిరాజ్, భిక్షపతి ముదిరాజ్, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ & ఫౌండర్ విశ్వనాథుల పుష్పగిరి, జాతీయ సహాయ కార్యదర్శి చొల్లేటి ప్రభాకర్, అబ్బోజు రామ్ సుధాకరాచారి, హేమ జిల్లోజు, స్థపతి, యూత్ వింగ్ కార్యదర్శి నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు.. హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు
Media Accreditation | అక్రిడేషన్ కార్డుల గడువు మరో 3 నెలలు పొడిగింపు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

