RS Praveen Kumar | ఈ క్రైస్తవ బిడ్డలు ఏం పాపం చేశారు.. రేవంత్ రెడ్డి గారూ..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులు అందరూ సిద్ధమయ్యారు. చర్చిలు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు కూడా క్రిస్మస్ పండుగకు హాలీడేస్ ఇచ్చాయి.
RS Praveen Kumar | హైదరాబాద్ : క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులు అందరూ సిద్ధమయ్యారు. చర్చిలు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు కూడా క్రిస్మస్ పండుగకు హాలీడేస్ ఇచ్చాయి. కానీ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలకు సీఎం రేవంత్ రెడ్డి సెలవులు ప్రకటించలేదు. సెలవులు ఇవ్వకపోవడంతో గురుకులాల్లో చదువుతున్న క్రిస్టియన్ విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
ఈ క్రైస్తవ బిడ్డలు ఏం పాపం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారూ..? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. అందరి పిల్లల లాగా వీళ్లకు కూడా పండగ పూట వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి సరదాగా గడిపే అవకాశం ఉండాలె కదా? మీ రాహుల్ గాంధీ చెప్తున్న లౌకితత్వం అంతా ఉట్టిదేనా? అని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
ప్రతి సంవత్సరం ఇచ్చిన విధంగానే ఈ ఏడాది కూడా 3 రోజులు క్రిస్మస్ సెలవులి వ్వాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీకి చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది సెలవులను ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్ను పురస్కరించుకుని సొసైటీలో ప్రతి సంవత్సరం 24,25,26న సెలవులు ఇచ్చేవారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేయలేదు. విద్యార్థులను ఇళ్లకు పంపకపోవడంతో ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగుతున్నారు. తమకు అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని, దానికి కూడా విద్యార్థులను పంపకపోతే ఎలా అని మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | యేసు ప్రభువు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం : హరీశ్‌రావు
Allu Arjun | అల్లు అర్జున్‌పై ప్రశ్నల వర్షం.. మరికాసేపట్లో సీన్రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్‌కు బన్ని..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

