Harish Rao | హైదరాబాద్ : మెన్నోనైట్ బ్రదర్న్ క్రైస్తవ సంఘం ప్రతినిధులు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజం కోసం ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. దయ, సేవాగుణం, క్షమాగుణం కలిగిన యేసు ప్రభువు జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టమస్ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని, ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వంలో ఆ నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌కే ఆ ఘనత దక్కుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | కల్లోల కాంగ్రెస్ పాలనలో.. ధాన్యం కొనుగోళ్లు లేక రైతన్నల ఆందోళనలు: కేటీఆర్