KTR | కల్లోల కాంగ్రెస్ పాలనలో.. ధాన్యం కొనుగోళ్లు లేక రైతన్నల ఆందోళనలు: కేటీఆర్
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొన్నది కాకరకాయ.. కొసిరింది గుమ్మడికాయ అన్నట్లు కాంగ్రెస్ సర్కార్ తీరు ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది 46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని విమర్శించారు.
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొన్నది కాకరకాయ.. కొసిరింది గుమ్మడికాయ అన్నట్లు కాంగ్రెస్ సర్కార్ తీరు ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది 46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని విమర్శించారు. రైతుభరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేల కోట్లకుగాను గత వానాకాలం, యాసంగి కలిపి ఎగ్గొట్టింది రూ.26 వేల కోట్లని చెప్పారు.
క్వింటాలుకు రూ.500 బోనస్ అని రైతులలో ఆశలు రేపి దొడ్డు వడ్లకు.. తెడ్డు చూపి, సన్న వడ్లకు సవాలక్ష కొర్రీలు పెట్టి విదిలించింది కేవలం రూ.530 కోట్లని మండిపడ్డారు. అసలు రైతుకే భరోసా లేదని, ఇక కౌలు రైతులు, రైతుకూలీల ఊసెక్కడిదని ధ్వజమెత్తారు. కల్లాల వద్దకే కొనుగోళ్లతో కేసీఆర్ ప్రభుత్వంలో రైతుకు భరోసా కల్పించామన్నారు. కల్లోల కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లు లేక రైతన్నలు నిత్యం ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
కొన్నది కాకరకాయ
కొసిరింది గుమ్మడికాయ అన్నట్లు1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది 46 లక్షల మెట్రిక్ టన్నులు !!
రైతుభరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేల కోట్లకు గాను గత వానాకాలం, యాసంగి కలిపి ఎగ్గొట్టింది 26 వేల కోట్లు
క్వింటాలుకు రూ.500… pic.twitter.com/Pn6idoEhoF
— KTR (@KTRBRS) December 24, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

