Gadwal | జోగులాంబ గద్వాల : రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో ప్రిన్సిపాళ్ల ప్రవర్తన మారడం లేదు. నిత్యం ఏదో ఒక చోట విద్యార్థులను మానసిక వేధింపులకు గురి చేస్తూ హింసకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నోరు విప్పడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
తాజాగా ఓ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు.. ఆ ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ ఏకంగా 18 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో వెలుగు చూసింది.
బీచుపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ అనుచితంగా ప్రవర్తిస్తూ, వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేని విద్యార్థులు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందించి, తమ సమస్యలను వివరిస్తామని బాధిత విద్యార్థులు పేర్కొన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్
కలెక్టరేట్ వరకు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన విద్యార్థులు.
జోగులాంబ గద్వాల – ఎర్రవల్లి మండలం బీచుపల్లిలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ విద్యార్థులను… pic.twitter.com/lVQqS1aJZR
— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | 42 శాతం రిజర్వేషన్లను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోం : ఎమ్మెల్సీ కవిత
Harish Rao | కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
Media Accreditation | అక్రిడేషన్ కార్డుల గడువు మరో 3 నెలలు పొడిగింపు